రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన సింపుల్ మరియు క్యూట్ లవ్ స్టొరీ సినిమా ఈగ.. హీరో నాని, సమంత ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలో కన్నడ స్టార్ కిచ్చ సుధీప్ విలన్ పాత్రలో నటించారు.. ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సుధీప్ ఆ తర్వాత వరుస అవకాశాలతో దూసుకుపోతున్నారు..మొన్న వచ్చిన చిరంజీవి సైరా సినిమాలో ప్రముఖ పాత్రలో నటించారు..


అయితే విషయానికొస్తే..కిచ్చా సుదీప్ కన్నడలో పెద్ద స్టారే కావచ్చు. కానీ ఆయన భార్య మాత్రం మరో హీరో కోసం పడి చస్తుందట. ఆ హీరో సినిమాలకోసం తనని కూడా పక్కన పడేస్తుందట..ఈ విషయాన్ని స్వయంగా  ఆయనే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. సుదీప్ నటించిన మూడో హిందీ సినిమా ‘దబాంగ్ 3’. ఇందులో ఆయన బల్లీ సింగ్‌ అనే విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సుదీప్ బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ గురించి మాట్లాడారు.

 

ఆయన మాట్లాడుతూ..నేను హృతిక్ రోషన్‌తో సినిమా చేస్తున్నానని తెలిస్తే అందరికంటే ముందుగా సెట్స్‌కు వచ్చేది నా భార్యే. తను హృతిక్‌కు వీరాభిమాని. ఆమె కోసమే నేను హృతిక్ నటించిన తొలి సినిమా ‘కహో నా ప్యార్ హై’ పది సార్ల కంటే ఎక్కువగా చూశాను. ఒకవేళ సినిమాకు తీసుకెళ్లకపోతే నన్ను బెదిరించేది. నేను తీసుకెళ్లకపోతే తన స్నేహితులతో వెళ్లిపోయేది. నేను తొలిసారి ఆ సినిమా చూసినప్పుడు నాకు చాలా నచ్చింది. నాకు హృతిక్ అతని డ్యాన్స్ చాలా నచ్చింది. 


ఏదైనా సినిమాలో ఆన్ స్క్రీన్ మీద హృతిక్ రోషన్ ఎప్పుడు డ్యాన్స్ చేసినా నా భార్య నా చెయ్యి పట్టుకుని గిచ్చేది. .సల్మాన్ ఖాన్, సుదీప్ నటించిన ‘దబాంగ్ 3’ సినిమా క్రిస్మస్‌కి విడుదల కాబోతోంది. ప్రభుదేవా డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో సోనాక్షి సిన్హా కథానాయికగా నటించారు. ఈ సినిమాలో సుదీప్‌ను సల్మాన్‌కు సమానంగా చూపించారు. క్లైమాక్స్‌లో జరిగే ఫైటింగ్‌ సీన్‌లో సల్మాన్, తాను జంతువుల్లా కొట్టుకున్నామని తెలిపారు.మరో రెండు ప్రాజెక్టులో సుధీప్ నటిస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: