‘వెంకీ మామ’ ప్రమోషన్ ను చాల డిఫరెంట్ గా చేయడానికి అనుసరిస్తున్న వ్యూహాలలో ఇప్పుడు లేటెస్ట్ గా సమంత వచ్చి చేరింది అన్న వార్తలు వినిపిస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు ‘వెంకీ మామ’ ను ప్రమోట్ చేస్తూ సమంత వెంకటేష్ నాగచైతన్యలతో కలిపి ఒక స్పెషల్ ఇంటర్వ్యూను ఇప్పటికే షూట్ చేసినట్లుతెలుస్తోంది. 

అయితే ఈ ఇంటర్వ్యూ సాధారణ ఇంటర్వ్యూలు లా కాకుండా ఇప్పటి వరకు వెంకటేష్ నాగ చైతన్యల వ్యక్తిగత జీవితాలకు సంబంధించి ఎవరికీ తెలియని కొన్ని సీక్రెట్స్ కు సంబంధించి సమంత కొన్ని షాకింగ్ ప్రశ్నలు ఆ ఇంటర్వ్యూలో అడిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఇలాంటి ప్రశ్నలు అడిగే చనువు బయట యాంకర్స్ కు ఉండదు కాబట్టి సురేశ్ బాబు వ్యూహాత్మకంగా సమంతతో ఈ ఇంటర్వ్యూను చేయించినట్లు టాక్.


తెలుస్తున్న సమాచారం మేరకు సమంత తనకు వచ్చిన అవకాశాన్ని అన్ని రకాల సద్వినియోగం చేసుకుంటూ అనేక చిలిపి ప్రశ్నలు వెంకటేష్ ను నాగచైతన్యను అడుగుతూ ఇరుకున పెట్టడానికి చాల గట్టి ప్రయత్నాలు చేసినట్లు లీకులు వస్తున్నాయి. ఈ ఇంటర్వ్యూను అన్ని ప్రముఖ ఛానల్స్ లో ప్రసారం చేయడానికి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి అయ్యాయని తెలుస్తోంది. 

వెంకటేష్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన కాలంలో మీడియా ఇంత పవర్ ఫుల్ గా లేదు. దీనికితోడు షోషల్ మీడియా అంటే ఏమిటో కూడ తెలియని ఆరోజులలో వెంకటేష్ సినిమాల గురించి అప్పట్లో అందరూ మాట్లాడుకున్నారు కాని వెంకీ వ్యక్తిగత జీవితం గురించి ఎప్పుడు వార్తలు రాలేదు. దీనితో ఆలోటును తీరుస్తూ సమంత ‘వెంకీ మామ’ ను తన ప్రశ్నలతో ఒక ఆట ఆడుకోవడమే కాకుండా మధ్యలో నాగ చైతన్యను కూడ తెగ కార్నర్ చేసిందని వార్తలు వినిపిస్తున్నాయి. దీనితో ‘వెంకీ మామ’ సినిమా మ్యానియా పెంచడానికి సమంత కూడ తన వంతు కృషి చేస్తోంది అని అనుకోవాలి..     

 

మరింత సమాచారం తెలుసుకోండి: