వయసు పెరిగినా అందంతో ఆకట్టుకొంటున్న హీరోయిన్లలో శ్రీయ సరన్ ఒకరు. ఏళ్లు గడిచినా.. యువ హీరోయిన్ల పోటీని తట్టుకొంటూ వరుస ఆఫర్లను దక్కించుకొంటున్నది ఈ హీరోయిన్. ఈ అందాల భామ పెళ్లి తర్వాత కూడా సినిమాల జోరు కొనసాగిస్తున్నది. వాస్త‌వానికి ఒకవైపు తెలుగు, తమిళంలో ఒక వెలుగు వెలుగుతున్న‌ టైమ్‌లోనే బాలీవుడ్‌ వెళ్లి లక్‌ను పరీక్షించుకుంది. కానీ అక్క‌డ ఆమెకు అనుకున్న స్థాయిలో ఫ‌లితం రాలేదు. దీంతో యూట‌ర్స్ తీసుకున్న శ్రియ‌  ఆ తర్వాత అక్కినేని ఫ్యామిలీ మొత్తం కలిసి నటించిన ‘మనం’ సినిమా శ్రియకు తెలుగులో మళ్లీ బిజీ అయ్యేలా చేసింది.

 

ఇక మ‌రోవైపు ప్రౌఢ సుందరి శ్రియా అంటే ఇప్పటికీ అభిమానుల్లో క్రేజ్ తగ్గలేదు. వయసు పెరిగినా అమ్మడి అందం ఇనుమడిస్తోందే తప్ప తగ్గడం లేదు. ఇప్పటికీ సీనియర్‌ హీరోల సరసన నటిస్తూ మెప్పిస్తోంది ఈ బ్యూటీ. సినిమాల్లోనూ నటిస్తూనే వ్యక్తిగత జీవితాన్ని కూడా ఎంజాయ్ చేస్తోంది ఈ బ్యూటీ. ఇక‌ తాజాగా శ్రీయ నటిస్తున్న తమిళ చిత్రం సందకారి. ఈ చిత్రానికి ఆర్ మాధేశ్ దర్శకత్వం వహిస్తుండగా.. వెమల్ హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రం మలయాళంలో విజయం సాధించిన మై బాస్ అనే చిత్రం ఆధారంగా తెరకెక్కుతున్నది. ఈ చిత్రం ప్రస్తుతం లండన్‌లో షూటింగ్ జరుపుకొంటున్నది. 

 

అయితే ఈ సినిమాలో షూటింగ్ లండ‌న్‌లో జ‌రుగుతుండ‌గా.. అక్క‌డ అడ్డంగా దొరికిపోతంది శ్రియ‌. వివ‌రాల్లోకి వెళ్తే.. సందకారి సినిమా షూటింగ్ ను లండన్ ఎయిర్ పోర్టు పరిసరాల్లో చిత్రీకరిస్తుండగా, శ్రియ ఒక్కసారిగా హై సెక్యూరిటీ జోన్ లో ప్రవేశించింది.  వెంటనే అప్రమత్తమైన లండన్ పోలీసులు ఆమెకు తుపాకీ గురిపెట్టారు. అదుపులోకి తీసుకుని ప్రశ్నల వర్షం కురిపిస్తుండడంతో శ్రియ షాక్ కు గురైంది. దాంతో చిత్ర యూనిట్ సభ్యులు తగిన అనుమతి పత్రాలు చూపించడంతో లండన్ పోలీసులు శాంతించారు. అప్పటికే హడలిపోయిన శ్రియ బతుకుజీవుడా అంటూ అక్కడ్నించి ఇవతలికి వచ్చేసిందట. కాగా, ఆ షాక్ నుంచి తేరుకోవ‌డానికి శ్రియ‌కు చాలా స‌మ‌య‌మే ప‌ట్టింద‌ట‌.

మరింత సమాచారం తెలుసుకోండి: