ఈరోజుల్లో సినిమాల్లో హీరోయిన్ పాత్రలంటే కేవలం రొమాన్స్, పాటలకే పరిమితం, వారికి యాక్టింగ్ కి స్కోప్ ఇచ్చే పాత్రలు ఒక్కటంటే ఒక్కటి దొరకవనేవి అందరికీ తెలిసిన వాస్తవం. ఇలాంటి రోజుల్లో బాలీవుడ్ కు చెందిన ఒక అగ్ర కథానాయిక అయిన దీపిక ఒక యాసిడ్ దాడి బాధితురాలిగా నటించడం నిజంగా సాహసమే. చెపాక్ సినిమాలో యాసిడ్ దాడి బాధితురాలు 'లక్ష్మి అగర్వాల్' పాత్రలో దీపిక నటించిన తీరు అద్భుతం, ఇది అంత సులువైన పాత్ర కాదు అతి భయంకరంగా కనిపించే మేకప్ వేసుకుని కొన్ని నెలల పాటు దీపిక ఈ పాత్ర పోషించింది.

 

నిన్న చెపాక్ ట్రైలర్ ను చిత్ర బృందం విడుదల చేసింది, తాను నటించిన పాత్రను చూసి స్వయంగా దీపికానే కంటతడి పెట్టుకున్నారు. ఒక అమాయక యువతిపై అతి క్రూరంగా యాసిడ్ దాడికి ఒక దుర్మార్గుడు పాల్పడగా, ఆ యువతి తనకు జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడుతుంది ఇదే ఈ చిత్ర కథాంశం. చెపాక్ ట్రైలర్ విడుదలైన కొద్ది నిమిషాల్లోనే 60 లక్షల వ్యూస్ ను యూట్యూబ్ లో సాధించింది. ట్రైలర్ చూసిన ప్రతీ ఒక్కరు దీపిక పడుకోన్ నటనకు ముగ్ధులయ్యారు. ట్రైలర్ లో భయంకరమైన ముఖంతో కనిపించి దీపిక తాను ఈ పాత్రకు ఎంతలా దగ్గరయ్యారో చెప్పారు.

 

యాసిడ్ దాడి భాదితురాలి నిజం జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చెపాక్ సినిమా జనవరి 10, 2020 న విడుదల కానుంది. ప్రస్తుతం విడుదలైన ట్రైలర్ కు నెటిజన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. దీపిక నటన అద్భుతమంటూ పొగిడేస్తున్నారు. బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ దీపిక నటన మెచ్చుకుంటూ చెపాక్ సినిమా కి గుడ్ లక్ చెప్పేసారు. ఇక అలియా భట్ కూడా దీపిక నటనకు ఫిదా అయింది. తన ట్విట్టర్ అకౌంట్లో దీపిక ను అలియా అభినందించారు. ఇంతలా అందరిని ఆకట్టుకుంటున్న ట్రైలర్ ను మీరు చూసెయ్యండి.

 

https://youtu.be/kXVf-KLyybk

మరింత సమాచారం తెలుసుకోండి: