నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. మొన్న వచ్చిన గ్యాంగ్ లీడర్ సినిమా అనుకున్నంతగా ఆడకపోయినప్పటికీ వరుసగా సినిమాలు ఒప్పుకుంటున్నాడు. ప్రస్తుతం ఇంద్రగంటి మోహనక్రిష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న "వి" చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అది చిత్రీకరణలో ఉండగానే మజిలీతో హిట్ అందుకున్న దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో "టక్ జగదీష్" అంటూ మన ముందుకు వస్తున్నాడు.

 

టాలీవుడ్ లో మిడ్ రేంజ్ హీరోలలో నానిది ప్రత్యేక స్థానం. అటు స్టార్ హీరోలతో పోటీ పడుతూ, మిడి రేంజ్ హీరోలలో తన స్థానాన్ని కాపాడుకుంటున్నాడు. నానికి పోటీనిస్తున్న యువ హీరో విజయ్ దేవరకొండ. అయితే గత కొన్ని రోజులుగా నాని దర్శకులతో చేయాలని విజయ్ చూస్తూ వచ్చాడు. కానీ ప్రస్తుతం విజయ్ దర్శకుడితో పనిచేసేందుకు నాని సిద్ధం అవుతున్నాడు. రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఓ మోస్తారు విజయం అందుకుంది.

 

ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తాడని సమాచారం.  నానితో రెండు సినిమాలకి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఒకేసారి ఒప్పందం చేసుకుంది. 'జెర్సీ' తర్వాత నానితో మరో చిత్రం కోసం ఈ సంస్థ వేచి చూస్తోంది. సుధీర్‌ వర్మని కథ రాయమని పురమాయించారు కానీ అతను ఇంతవరకు లైన్‌ ఏదీ రెడీ చేయలేదట. ఈలోగా రాహుల్‌ చెప్పిన లైన్‌ విన్న నాని ఈ ప్రాజెక్ట్‌ని సితార లైన్‌లోకి తీసుకెళ్లి పెట్టాడు. ఈ చిత్రం మొదలు కావడానికి కాస్త సమయం పడుతుందట.

 

నాని ప్రస్తుతం రెండు చిత్రాలతో బిజీగా ఉన్నాడు కాబట్టి వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చే ఏడాది చివర్లో ఈ చిత్రం మొదలవనుందట. నాని కోసం మంచి స్క్రిప్ట్ నే రెడీ చేస్తున్నాడట. మరి ఈ సినిమా టాక్సీవాలాలా కాకుండా ఈ రేంజ్ లో హిట్టవ్వాలని కోరుకుందాం.

మరింత సమాచారం తెలుసుకోండి: