ఇప్పటివరకు ఎన్టీఆర్ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను చిత్రానికి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న అలా వైకుంఠపురంలో చిత్ర ప్రీ రిలీజ్ వేడుకకు ఎన్టీఆర్ ని చీఫ్ గెస్ట్ గా పిలిచినట్లు సమాచారం. అయితే దీనికి ఎన్టీఆర్ కూడా అంగీకరించినట్లు తెలిసింది. అయితే అల్లు అర్జున్- జూనియర్ ఎన్టీఆర్ ల మధ్య సత్సంబంధాలు ఉండటం కూడా ఒక కారణం అని తెలిసింది.

 

అయితే ఈ సంక్రాంతి బరిలో నందమూరి సినిమాలు ఏమి లేవు. అందుచేత ఎన్టీఆర్ కూడా ఈ వేడుకకు వచ్చే అవకాశం వుంది. హిట్ కోసం చూస్తున్న అల్లు అర్జున్ కు ఎన్టీఆర్ అభిమానులు కూడా తోడైతే బొమ్మ బ్లాక్ బస్టర్ పక్కా. అయితే దీనికి సంబందించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు.  చిత్ర బృందం ఇప్పటికే ఈ చిత్ర ప్రమోషన్లను వేగం చేసింది. అల్లు అర్జున్ సరసన పూజ హెగ్డే నటిస్తుండగా, ఈ చిత్రానికి థమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.

 

వచ్చే ఏడాది జనవరి 11న సంక్రాంతి సందర్భంగా విడుదల కానుంది. అల్లు అర్జున్ గత సినిమా 'నాపేరు సూర్య.. నా ఇల్లు ఇండియా' అనుకున్నంతగా అలరించకపోవడంతో బన్ని కసితో ఉన్నాడు. ఎలాగైనా ఈ సినిమా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఈ సినిమాలో నటిస్తున్నాడు. దీంతో  ఈ చిత్రం పై భారీ అంచనాలున్నాయి. దీనికి తోడు థమన్ అందించిన సాంగ్స్ యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా విపరీతంగా అలరిస్తున్నాయి. ఈ మూవీ టీజర్ ఇంకొద్ది గంటల్లో విడుదల కానుంది. కాగా అలవైకుంఠపురంలో డిజిటల్ రైట్స్ విషయంలో ఓ ఆసక్తికర వార్త బయటికి వచ్చింది. డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థ సన్ నెట్ వర్క్ అలవైకుంఠపురంలో డిజిటల్ రైట్స్ భారీ ధర చెల్లించి దక్కించుకుందట. దీనికి సంబంధించి డీల్ కూడా పూర్తయిందని సమాచారం. అంతేకాదు శాటిలైట్ హక్కులు కూడా సన్ నెట్ వర్క్ సంబందించిన జెమిని టీవీ దక్కించుకుందని టాక్. అల వైకుంఠపురంలో చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. మరో ముఖ్య పాత్రల్లో  టబు, సుశాంత్, నివేదా పేతురాజ్ నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: