మోడీ నోట్ల రద్దు విషయంలో ఎప్పుడు ఎలాంటి సంచలన నిర్ణయాలు తీసుకుంటారో ఎవరు ఊహించలేరు. ఇలాంటి సందేహాలే ఒకవైపు మార్కెట్ ను మరో వైపు ప్రజలను బెదిరిపోయేలా చేస్తూ ఉన్నాయి. పొద్దుపోయిన తర్వాత ప్రకటనలకు అర్ధరాత్రి తర్వాత నిర్ణయాలకు మోడీ కేరాఫ్ అయ్యారు. మూడేళ్ల కిందట ఇచ్చిన నోట్ల రద్దు మాస్టర్ స్ట్రోక్ మోడీ విషయంలో ప్రజలు ఎప్పటికీ మరిచిపోయేలా లేరు. ఇలాంటి నేపథ్యంలో కొన్ని రూమర్లకు కూడా అవకాశం ఏర్పడుతూ ఉంది. అందులో ఒకటి.. రెండు వేల రూపాయల నోటు విషయంలో తరచూ రక రకాల ప్రచారాలు సాగుతూ ఉన్నాయి. రెండు వేల రూపాయల నోటు త్వరలో రద్దుకాబోతోందంటూ చాన్నాళ్లుగా ప్రచారం సాగుతూ ఉంది. ఈ విషయం జనాల్లోనే కాదు పెద్ద పెద్ద బిజినెస్ మాన్స్ లోను టెన్షన్ పెట్టిస్తుంది. లక్షల్లో, కోట్లల్లో వ్యాపారాలు చేసే వాళ్ళు ఇంకా భయపడి చస్తున్నారు.

 

ఇంతక ముందు వరకూ అనేకసార్లు సార్లు ఈ అంశం చర్చనీయాంశంగా నిలిచింది. రెండు వేల రూపాయల నోటు ఈ మధ్యకాలంలో ఏటీఎంలలో కూడా కనబటట తక్కువైపోయింది. 90% 500 నోట్లే కనిపిస్తిన్నాయి. ఈ నేపథ్యంలో 2000 నోటు ముద్రణను ఆపేసినట్టుగా ఇది వరకే కేంద్రం ప్రకటించింది. అసలే కరెన్సీ.. ఈ నేపథ్యంలో దాని గురించి రూమర్లు సందేహాలు కూడా చాలా త్వరగా వ్యాపిస్తాయి. అలాంటి సందేహమే ఎంపీలకు కూడా వచ్చింది. ఇదే విషయాన్ని లోక్ సభలో రీసెంట్‌గా ప్రస్తావించారు.

 

ఇంతకీ రెండు వేల రూపాయల నోటు ఉంటుందా? రద్దవుతుందా? అంటూ వారు కేంద్రాన్ని అడిగారు. దీనిపై కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందించారు. రెండు వేల రూపాయల నోటును రద్దు చేసే ఉద్ధేశం కేంద్రానికి లేదంటూ ఆయన ప్రకటించారు. అది మారకంలో ఉందని చెల్లుతుందని చెప్పారు. ఈ వార్త విన్న ఎంతో మంది హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నారు. గతంలో జరిగినట్టుగా 1000, 500 రూపాయల నోట్లు మార్చుకున్నట్టుగానే ఇప్పుడు 2000 రూపాయల మార్పిడికి జనాలు, వ్యాపారస్తులు పరుగులు తీయాల్సి ఉంటుంది. అందునా 2000 నోటు కాబట్టి అంత సులువుగా మార్చడం కష్ఠం.

మరింత సమాచారం తెలుసుకోండి: