టాప్ హీరోల పారితోషికాలు చుక్కలు అంటుతున్న నేపధ్యంలో మీడియం రేంజ్ హీరోలు కూడ 10 కోట్లు కావాలని పట్టుబడుతున్నారు. అయితే 100 సినిమాలకు పైగా నటించిన బాలకృష్ణ పారితోషికం మాత్రం 10 కోట్ల రేంజ్ దాటక పోవడంతో బోయపాటి మూవీతో తన పారితోషికాన్ని కనీసం 13 కోట్లకు పెంచుకోవాలని బాలయ్య ప్రయత్నించినట్లు టాక్. 

అయితే ఈ మూవీ బడ్జెట్ సుమారు 70 కోట్ల వరకు చేరుకోవడంతో పాటు దర్శకుడు బోయపాటి 12 కోట్లకు మించి తగ్గక పోవడంతో ఈ మూవీ నిర్మాత పడుతున్న టెన్సన్ ను చూసి బాలయ్య ఒక రాజీ మార్గాన్ని సూచించినట్లు టాక్. తన పారితోషికాన్ని 10 కోట్లకు సరిపెట్టుకోవడమే కాకుండా తన పారితోషికాన్ని కూడ ఈమూవీ నిర్మాణం పూర్తి అయి బిజినెస్ పూర్తి అయిన తరువాత ఇమ్మని ఈ మూవీ నిర్మాతకు భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. 


దీనితో బోయపాటి మూవీ ప్రాజెక్ట్ ముందుకు నడవడానికి బాలయ్య ఒక మెట్టు దిగాడు అంటూ ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి ప్రస్తుతం బాలయ్యకు ఉన్న మార్కెట్ పరిగణలోకి తీసుకుంటే అతడి మూవీ పై 40 కోట్లు మించి ఖర్చు పెడితే ఆ డబ్బు తిరిగి రాదు అన్న ప్రచారం ఉంది. ఇలాంటి పరిస్థితులలో బాలయ్య బోయపాటిల కాంబినేషన్ ను నమ్ముకుని ఈ మూవీ నిర్మాత ఏ ధైర్యంతో 70 కోట్ల భారీ బడ్జెట్ మూవీ తీస్తున్నాడు అంటూ ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. 

ఈ నెల 20న విడుదల కాబోతున్న ‘రూలర్’ మూవీ అనుకున్న స్థాయిలో విజయం సాధించకపోతే బోయపాటి బాలయ్యల మూవీకి మరిన్ని కష్టాలు ఏర్పడే ఆస్కారం ఉంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి హీరోయిన్ గా నటించడానికి కీర్తి సురేశ్ ఒప్పుకుని ఆ తరువాత యూటర్న్ తీసుకుని తన బల్క్ డేట్స్ అన్నీ రజినీకాంత్ లేటెస్ట్ మూవీకి ఇచ్చివేయడంతో బాలయ్య సినిమాకు మళ్ళీ హీరోయిన్ కష్టాలు మొదటికి వచ్చాయి..  

మరింత సమాచారం తెలుసుకోండి: