పెళ్లి కళ వచ్చేసిందా ఈ ముద్దుగుమ్మకి ?ప్రస్తుతం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో కాజల్‌ అగర్వాల్‌ గురించి వైరల్‌ అవుతున్న ప్రశ్న ఇదే.  దక్షిణాదిలో ముఖ్యంగా కోలీవుడ్, టాలీవుడ్‌లో ప్రముఖ కథానాయకిగా   వెలుగుతున్న నటి కాజల్‌ అంతేకాదు ఆమె  ఈ ఉత్తరాది బ్యూటీ. అయితే ఈ అమ్మడికి  ప్రస్తుతం అవకాశాలు తగ్గాయి అనే కంటే  ఒక్క అవకాశం కూడా టాలీవుడ్‌లో లేదు.

 

ఇక కోలీవుడ్‌లో ఇండియన్‌–2 చేతిలో కమలహాసన్‌కు జంటగా శంకర్‌ దర్శకత్వంలో  నటిస్తున్న ఒకే ఒక్క చిత్రం ఉంది. ఈ చిత్రాన్ని కూడా పూర్తి చేసి  సంసార జీవితంలోకి అడుగుపెట్టాలని కాజల్‌ భావిస్తున్నట్లు సమాచారం. నిజానికి  చాలాకాలం నుంచే కాజల్‌అగర్వాల్‌కు ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా తనే ఆ మధ్య  చెప్పింది.

 

 ఇక  కాజల్‌ చెల్లెలు నిషా అగర్వాల్‌కు పెళ్లి అయ్యి ఒక బిడ్డకు కూడా జన్మనిచ్చింది. అయితే అప్పట్లో కెరీర్‌ హైప్‌లో ఉండడంతో పెళ్లి జోలికి కాజల్‌అగర్వాల్‌ వెళ్లలేదు. తనకు కావల్సివున్న భర్త ఎలా ఉండాలో ఒక పెద్ద  లిస్టే ఇచ్చింది కాజల్.  కానీ  ఈ అమ్మడు అభిమానులందరికి ఒక పెద్ద షాక్ ఇచ్చింది .అస్సలు విషయమేమిటంటే  ఈ అమ్మడు ఇటీవల ప్రేమలో పడినట్లు ప్రచారం జోరుగా సాగింది. ఇక కాజల్  డీప్‌గా పారిశ్రామికవేత్తను లవ్‌ చేస్తున్నట్లు ప్రచారం హోరెత్తింది. ఇటీవల కాజల్‌కు వరుడు దొరికాడు అనే వార్తలు హల్‌చల్‌ చేశాయి. అప్పుడు అలాంటి వార్తలను కొట్టి పడేసిన కాజల్‌  ఇటీవల తన కుటుంబసభ్యులతో కలిసి అజ్మీర్‌ దర్గాకు వెళ్లి మొక్కులు తీర్చుకుంది.  

 

ఇటీవల సామాజిక మాధ్యమాల్లో ఆ ఫొటోలు వైరల్‌ అయ్యాయి. కాగా తన ఇన్స్టాగ్రామ్ లో  ఒక ఫొటోను పోస్ట్‌ చేసింది. అది ఇప్పుడు పలు రకాల ఊహలకు తావిస్తోంది. అదేంటంటే సముద్ర తీరంలో సంధ్యాసమయంలో  కాజల్‌ రెండు చేతులు పైకి ఎత్తి నిలబడినట్లు ఉంది. అయితే ఆమె రెండు చేతుల వేళ్లను ఆర్టిన్‌ ఆకారాన్ని చూపించేలా పెట్టింది. దీంతో  నెటిజన్లు తాను ప్రేమలో పడ్డట్టు సింబాలిక్‌గా కాజల్‌ చెప్పిందంటూ ప్రచారం చేస్తున్నారు. దీంతో ఆమె అభిమానులు పెళ్లి కళ వచ్చేసిందా కాజల్‌? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అంతే కాకుండా ఈ బ్యూటీకి ఇండియన్‌ –2నే చివరి చిత్రం అనే ప్రచారం జోరందుకుంది. మరి ఇలాంటి ప్రచారానికి కాజల్‌ ఎలా స్పందిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: