ఒకానొక సమయంలో టాలీవుడ్ లో దేవిశ్రీని మించిన సంగీత దర్శకుడు లేడు. ఏ పెద్ద సినిమాకైనా దేవిశ్రీనే సంగితం అందించేవాడు. దేవి కోసం దర్శకులు క్యూ కట్టారంటే అప్పుడు దేవికి ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. కానీ ప్రస్తుతమ్ పరిస్థితులు అలా లేవు. దేవి సంగీతం చాలా రొటీన్ గా ఉంటుంది. అంతేగాక ఇచ్చిన ట్యూన్లే ఇస్తున్నాడనే విమర్శ కూడా ఉంది. గత కొన్ని రోజులుగా దేవి సంగీతం అందించిన సినిమాలని గమనిస్తే ఈ విషయం క్లియర్ గా అర్థం అవుతుంది.

 

ఒక్క రంగస్థలం తప్ప దేవి అందించిన సంగీతం చాలా రొటీన్ గా ఉంది. ఎంసీఏ-హలో గురూ ప్రేమ కోసమే-మహర్షి ఆడియోలు దేవీ రేంజులో లేవన్న విమర్శలు వచ్చాయి. తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు పరిస్థితి అంతకుమించి గొప్పగా ఏం లేదు. ఈ సినిమాకి సంబంధించి రెండు లిరికల్ సాంగ్స్ రిలీజైతే రెండిటికీ విమర్శలు తప్పలేదు. ట్యూన్స్ రొటీన్ అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తూనే ఉన్నాయి. కారణం ఏదైనా దేవీ మూస ధోరణిలో పడిపోయాడని అర్థమవుతోంది. 

 

ఇక ఇప్పటికే త్రివిక్రమ్.. కొరటాల లాంటి దర్శకులు దేవీని దూరం పెట్టేయడం హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ సమయంలో దేవి నుండి అద్భుతమైన సంగీతం ఆశించాలంటే అది సుకుమార్ తర్వాతి చిత్రంతోనే సాధ్యం అవుతుంది. సుకుమార్ బన్నీ కాంబినేషన్ లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా జనవరి చివరి వారం నుండి షూటింగ్ జరుపుకోనుంది.

 

అయితే ఈ సినిమా కోసం దేవి ట్యూన్లు సిద్ధం చేస్తున్నాడట. ఈ సినిమాలో పాటలు చాలా ఫ్రెష్ గా ఉండాలన్న ఉద్దేశ్యంతో ఒక్కో పాటకి యాభై ట్యూన్ల వరకు తీసుకుంటున్నాడట. మరి ఈ సినిమాకైనా రొటీన్ ట్యూన్లు కాకుండా సరికొత్త ట్యూన్లతో అందరినీ మైమరిపిస్తాడేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: