‘వెంకీ మామ’ ను ప్రమోట్ చేస్తూ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెంకటేష్ నాగచైతన్యకు సంబంధించి ఇప్పటి వరకు చాలామందికి తెలియని విషయాలు బయటపెట్టి అందరికీ షాక్ ఇచ్చాడు. చైతన్యను తాను చిన్నతనంలో చూసిన రోజులను గుర్తుకు చేసుకుంటూ అప్పట్లో విపరీతంగా చైతు చికెన్ స్వీట్స్ తినడమే ఒక పనిగా పెట్టుకుని విపరీతంగా తినేవాడు అన్న జ్ఞాపకాలను గుర్తుకు చేసుకున్నాడు. 

దీనికితోడు చైతన్య చిన్నతనంలో చాల లావుగా బొద్దుగా పెద్దపెద్ద బుగ్గలతో ఉండేవాడు అన్న విషయాన్ని బయటపెడుతూ తాను చైతన్య హీరో అవుతాడని కలలో కూడ అనుకోలేదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు. అంతేకాదు తాను ఇండస్ట్రీలోకి వచ్చి 30 సంవత్సరాలు దాటిపోయినా ‘వెంకీ మామ’ మూవీ షూటింగ్ లో పడ్డ టెన్షన్ ఎప్పుడు పడలేదు అంటూ జోక్ చేసాడు. 

ముఖ్యంగా ఈ మూవీ షూటింగ్ మొదటిరోజున నాగచైతన్యతో కలిసి నటిస్తున్నప్పుడు తాను చాల అసౌకర్యానికి గురి అయ్యానని తాను ట్రాక్ లోకి వచ్చి తన సహజసిద్ధమైన నటనతో చైతూ తో పోటీగా నటించడానికి తనకు రెండు రోజులు పట్టిన విషయాన్ని గుర్తుకు చేసుకున్నాడు. చిన్నతనం నుండి చైతు తమ ఇంటిలో పెరగడంతో చైతన్యను హీరోగా గుర్తించదానికి తనకు రెండు రోజులు సమయం పట్టింది అంటూ మరొక షాకింగ్ ట్విస్ట్ ఇచ్చాడు. 

చైతన్య తన నటన పట్ల చూపెడుతున్న ఏకాగ్రత ముఖ్యంగా బాడీ ఫిట్నెస్ గురించి చైతు చూపెడుతున్న శ్రద్ధ తనకు ఆశ్చర్యాన్ని కలిగించడమే కాకుండా చిన్ననాటి చైతన్య మారిపోయి మరొక అబ్బాయి అతడి స్థానంలో వచ్చాడా అన్న ఆశ్చర్యం తనకు ఇప్పటికీ వెంటాడుతోంది అంటూ జోక్ చేసాడు. ముఖ్యంగా తాను ఎందరో టాప్ హీరోలతో కలిసి మల్టీ స్టారర్ మూవీలు చేసినా చైతూతో కలిసి నటించిన ఈ మూవీలో తాను పడ్డ కష్టాలు తన కెరియర్ లో ఏ సినిమాకు పడలేదు అంటూ వెంకీ తన బాధలను బయట పెట్టాడు.. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: