కాజల్ రకుల్ ప్రీత్ ల క్రేజ్ పూర్తిగా తెలుగు ప్రేక్షకులలో తగ్గిపోయింది. దీనితో వీరిద్దరికీ అవకాశాలు పూర్తిగా తగ్గిపోతున్నాయి. చైతన్యను పెళ్ళి చేసుకున్న తరువాత కూడ సమంతకు క్రేజ్ కానీ అవకాశాలు కానీ ఏమాత్రం తగ్గడం లేదు. అయితే అలాంటి సమంతకు కాజల్ రకుల్ ప్రీత్ చేతిలో అవమానం ఎదురవ్వడంతో సమంత అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు.  

2019 సంవత్సరానికి గాను భారత దేశంలో టాప్ 10 ఎంటర్‌టైన్‌మెంట్స్ హ్యాండిల్స్ ఫీమేల్ లిస్టును ప్రకటించిన ట్విట్టర్ జాబితాలో కాజల్ రకుల్ ప్రీత్ లకు స్థానం లభించి ఇప్పుడు సమంతకు స్థానం లభించకపోవడం హాట్ న్యూస్ గా మారింది. ట్విట ర్ ప్రకటించిన ఈ ర్యాంకింగ్ లిస్టులో లతామంగేష్కర్ సోనాక్షి సిన్హ అనుష్క శర్మ అలియా భట్ సన్నీ లియోన్ తో పాటు కాజల్ కు 7వ స్థానం రకుల్ ప్రీత్ కు 10వ స్థానం లభించింది.  

వాస్తవానికి సమంతకు సోషల్ మీడియాలో 7.8 మిలియన్ ఫాలోయర్స్ ఉంటే కాజల్ కు 3.3 రకుల్ కు 3.8 మిలియన్ ఫాలోయర్స్ మాత్రమే ఉన్నారు. ఇలాంటి పరిస్థితులలో సమంతను కాదనీ కాజల్ రకుల్ లకు స్థానం ఎలా లభించింది అంటూ ఆమె అభిమానులు ట్విటర్ ర్యాంకింగ్స్ ను తప్పు పడుతున్నారు. 

అయితే బాలీవుడ్ క్రేజీ బ్యూటీ దీపిక పదుకొనెకు 26.6 మిలియన్ ఫాలోయర్స్ ఉన్నా దీపికకు ఈ టాప్ 10లో స్థానం దక్కలేదు దీనితో ట్విటర్ ర్యాంకింగ్స్ లో ఉన్న మతలబు ఏమిటి అంటూ సమంత అభిమానులు లోతైన విశ్లేషణలు చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే సమంతకు ఇలా పరాభవం జరగడంతో ఆమెకు జరిగిన ఈ పరాభవాన్ని జీర్ణించుకోలేని ఆమె అభిమానులు ట్విటర్ ప్రకటించిన ఈ ర్యాంక్స్ అన్నీ ఫేక్ అంటూ మరొక కొత్త ప్రచారానికి తెర తీసారు. అయితే ఈ అనుకోని పరిణామానికి మాత్రం కాజల్ రకుల్ మంచి జోష్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి..

 

మరింత సమాచారం తెలుసుకోండి: