కాజల్ అగర్వాల్ టాలీవుడ్ ప్రేక్షకులకి పరిచయం అక్కర్లేని పేరు. మగధీర సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ ఆ తరువాత టాలీవుడ్ అగ్ర కథానాయకుల అందరి సరసన నటించింది. అయితే ఈ అమ్మడు మాత్రం తన పెళ్లి విషయం గురించి ప్రస్తావిస్తే ఎప్పటికప్పుడు సమాధానం దాటవేస్తూ వస్తున్నారు. కాజల్ ఒక బిజినెస్ మాగ్నెట్ తో ప్రేమలో ఉందని అతన్నే పెళ్లి చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియా లో వార్తలు వచ్చాయి కానీ కాజల్ మాత్రం అవన్నీ పుకార్లే అంటూ కొట్టిపారేశారు.

 

తాజాగా కాజల్ ప్రేమలో పడ్డట్లు తెలుస్తోంది. త్వరలో తాను పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనికి కారణం కాజల్ తన ఇంస్టాగ్రామ్ లో పెట్టిన ఒక ఫోటో. ఇంతకీ ఈ ఫొటోలో ఏముంది అనుకుంటున్నారా?, "కాజల్‌ సముద్ర తీరంలో సంధ్యాసమయంలో రెండు చేతులు పైకి ఎత్తి నిలబడినట్లు ఉంది. అయితే ఆమె రెండు చేతుల వేళ్లను ఆర్టిన్‌ ఆకారాన్ని చూపించేలా పెట్టింది." ఇక ఈ ఫోటోపై నెటిజన్స్ తమదైన శైలిలో స్పందిస్తున్నారు. కాజల్ లవ్ లో పడ్డారా? కంగ్రాట్స్ పెళ్లి ఎప్పుడు అని కాజల్ ను అడుగుతున్నారు. కాజల్ వచ్చే ఏడాది పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం.

 

ప్రస్తుతం కాజల్ అగర్వాల్, రోబో, ఐ, అపరిచితుడు ఫేమ్ అయిన శంకర్ దర్శకత్వంలో నిర్మితమవుతున్న భారతీయుడు 2 లో నటిస్తున్నారు. ఈ సినిమా అప్పట్లో సంచలనం సృష్టించిన భారతీయుడు సినిమా కి సీక్వెల్. ఈ సినిమాలో కమల్ హాసన్ కు కాజల్ జోడీ గా నటిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా వచ్చే ఏడాది లో విడుదల అవ్వనుంది. ఈ సినిమా విడుదల అనంతరం కాజల్ పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు సమాచారం. కాజల్ చెల్లెలు నిషా అగర్వాల్ ఇప్పటికే పెళ్లి చేసుకున్నారు ఆమెకు ఒక బిడ్డ కూడా ఉన్నారు. నిషా అగర్వాల్ టాలీవుడ్ కి వరుణ్ సందేశ్ నటించిన ఏమైంది ఈవేళ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: