‘ఇష్టం’ సినిమాతో 2001వ సంవత్సరంలో తెలుగు సినిమా ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత వరుసగా మంచి సక్సెస్ సినిమాలు అందుకుంది హీరోయిన్ శ్రేయ. అప్పట్లో ఇండస్ట్రీలో టాప్ హీరోలు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ వంటి స్టార్ హీరోలందరితో నటించి తర్వాత జనరేషన్ అయినా జూనియర్ ఎన్టీఆర్ మహేష్ బాబు పవన్ కళ్యాణ్ వంటి హీరోలతో కూడా శ్రేయ నటించడం జరిగింది. ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ ముద్దుగుమ్మ అవకాశాల కోసం అక్కడ కొన్ని సినిమాలు చేసి కొన్ని విజయాలు సాధించడం జరిగింది. ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మ రష్యాకి చెందిన వ్యాపారవేత్తతో ప్రేమలో పడి అతన్ని పెళ్లి చేసుకోవడం జరిగింది.

 

దీంతో ప్రస్తుతం సినిమాల విషయంలో స్పీడ్ తగ్గించింది శ్రేయ. ఇది ఇలా ఉండగా.. శ్రియని లండన్ పోలీసులు పట్టుకున్నారట. ఈ మేరకు వార్తలు వెలువడుతున్నాయి.  ప్రస్తుతం శ్రియ 'సందకారి' అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ లండన్ లో జరుగుతోంది. అయితే అక్కడి ఎయిర్ పోర్ట్ లోని ఓ హై సెక్యురిటీ ప్రాంతంలోకి శ్రియ అనుమతి లేకుండా వెళ్లడంతో పోలీసులు గన్ పాయింట్ లో ఆమెని పట్టుకున్నారట. షూటింగ్ అక్కడే జరుగుతుండడంతో శ్రియ సరదాగా చుట్టుపక్కల విహరిస్తుంటే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

 

దీంతో ఈ విషయం తెలుసుకున్న సినిమా యూనిట్ సభ్యులు ఆ దేశ పోలీసులతో మాట్లాడి వారికి షూటింగ్ కి సంబంధించిన పర్మిషన్ లెటర్ చూపించి అదేవిధంగా గతంలో శ్రేయ హీరోయిన్ గా చేసిన ఫోటోలు స్మార్ట్ ఫోన్లో పోలీసులకు చూపించడంతో శ్రేయ హీరోయిన్ అని తెలుసుకొని పోలీసులు వదిలేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో గట్టిగా వినబడుతుంది అధికారికంగా మాత్రం బయటకు రాలేదు. వచ్చే సంవత్సరం 'సందకారి' కానీ ఈ సినిమా షూటింగ్ పూర్తయి రిలీజ్ చేయడానికి సినిమా యూనిట్ సభ్యులు రెడీ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: