మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా 'అలా వైకుంఠపురం లో'. అయితే సినిమాలో హీరో క్యారెక్టర్ హైలెట్ చేయాలంటే విలన్ ని చాలా క్రూరంగా కిరాతకంగా చూపిస్తారు సదరు సినిమా డైరెక్టర్. ఇదిలా ఉంటే ప్రస్తుతం అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న సినిమా 'అలా వైకుంఠపురం లో' మాత్రం హీరో అల్లు అర్జున్ క్యారెక్టర్ కంటే సినిమాలో ఓ కీలక క్యారెక్టర్ పై డైరెక్టర్ త్రివిక్రం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినట్లు ఇండస్ట్రీలో వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో అక్కినేని సుశాంత్ మరియు సీనియర్ హీరోయిన్ టబు మలయాళం యాక్టర్ జయరామ్ నటిస్తున్న విషయం అందరికీ తెలిసినదే. అయితే సినిమాల్లో వీరందరి కంటే ఎక్కువగా డైరెక్టర్ త్రివిక్రమ్ సీనియర్ హీరోయిన్ టబు పాత్రకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ఆమె భావోద్వేగాల పై సినిమా ఆధారపడేలా కథను నడిపించినట్లు ఇండస్ట్రీలో వినబడుతున్న టాక్.

 

సినిమా మొత్తం ఆమె చుట్టూనే తిరిగే విధంగా సరికొత్త రీతిలో తనదైన దర్శకత్వ శైలి లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అలా వైకుంఠపురం లో సినిమా తెరకెక్కించినట్లు సమాచారం. సినిమాలో బన్నీ హీరోయిజం కంటే కూడా కొన్ని ఎపిసోడ్స్ లో టబు ఎలివేషన్ హై రేంజ్ లో ఉంటుందని టాక్ వస్తోంది. గతంలో అత్తారింటికి దారేది సినిమాలో నదియా పాత్రను ఏ రేంజ్ లో ఎలివేట్ చేశారో స్పెషల్ గా చెప్పానవసరం లేదు.  ఇక ఇప్పుడు అంతకంటే హై లెవెల్లో డైరెక్టర్ త్రివిక్రమ్ టబు క్యారెక్టర్ నీ ఈ సినిమాలో డిజైన్ చేసినట్లు వార్తలు వినబడుతున్నాయి.

 

మరి టబు క్యారెక్టర్ వల్ల సినిమా ఎంతవరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి. గతంలో త్రివిక్రమ్ బన్నీ కాంబినేషన్ కలయికలో వచ్చిన రెండు సినిమాలు సూపర్ డూపర్ హిట్ కావడంతో అలా వైకుంఠపురం సినిమాతో హ్యాట్రిక్ కొట్టాలని ఇద్దరు సినిమా కోసం బాగా కష్ట పడినట్లు సమాచారం. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: