బాలీవుడ్‌లో ఇంటర్‌నేషనల్ యాక్టర్‌ నసీరుద్దీన్‌ షా ఇప్పుడు ప్రేమమంత్రం జపిస్తున్నాడు… ఆ వయసులో ప్రేమేంటని ఆశ్చర్యపోతున్నారా?మూడేళ్ల క్రితం ఇష్కియా చిత్రంలో విద్యాబాలన్‌తో నటించిన నసీర్‌జీ… ఇప్పటికే ఆ ఙ్ఞాపకాలనే గుర్తుకు తెచ్చుకుంటున్నాడు… అసలింతకీ ఏం జరిగింది? ఈ పెద్దాయన హార్ట్‌బీట్‌ ఎందుకు పెరిగింది. ఒకప్పటి హీరో… ఆతర్వాత విలన్‌.. ఈమధ్యకాలంలో రొమాంటిక్‌ యాక్టర్‌.. ఇవన్నీ బాలీవుడ్‌లో ఒక్క నసీరుద్దీన్‌షాకే సొంతం… ఆరుపదుల వయసులోనూ రొమాంటిక్‌ క్యారెక్టర్‌ని కూడా అవలీలగా పండించగలడీ ఇంటర్నేషనల్ యాక్టర్‌. . అందుకే మొన్నటి డర్టీ పిక్చర్‌ కూడా ఊలాలా అనిపించింది. డర్టీపిక్చర్‌కంటే ముందే విద్యాబాలన్‌తో ఇష్కియా సినిమాలో రొమాన్స్‌ చేశాడు నసీరుద్దీన్‌షా.. పక్కన అర్షద్‌వార్షీ ఉన్నా పోటీగా తానూ రేసులో ఉన్నానంటూ లవ్‌ కహానీ నడిపాడా సినిమాలో.. ఇప్పుడు ఇష్కియాకు సీక్వెల్‌గా వస్తోంది దేడ్‌ ఇష్కియా.. ఇందులో నసీర్‌, అర్షద్‌ ఉన్నా హీరోయిన్‌ ఛాన్స్ మాధురి కొట్టేసింది… సినిమా కూడా పూర్తయింది.. వచ్చేనెలలో రీలీజవబోతోంది..  ఇంత జరిగినా నసీరుద్దీన్‌షాకు ఇష్కియా ఙ్ఞాపకాలు వెంటాడుతున్నాయి.. దేడ్‌ ఇష్కియాలో కూడా విద్యాబాలన్‌ ఉండే బాగుండేదన్న ఫీలింగ్‌ కనిపిస్తోంది..దేడ్‌ ఇష్కియాలో విద్యా లేకపోడవం ఏంటని నసీరుద్దీన్‌షాను అభిమానులు కూడా అడిగారట..దానికి నసీర్ కూడా స్పందిస్తూ విద్యా గొప్ప నటి ఆమెతో నటించడం ఓ గొప్ప అనుభూతి అని చెప్పాడట.. విద్యాతో ఇంకా సినిమాలు చేయాలని తనకూ ఉందని మనసులో మాట చెప్పేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: