ఈరోజుల్లో  సినిమా ఇండస్ట్రీలో పైరసీ ప్రభావం మరింత ఎక్కువైపోతుంది. సినిమా విడుదలైన 24 గంటల్లోనే కోట్లు పెట్టి తీసిన సినిమా ఆన్ లైన్ లో ప్రత్యక్షం అయిపోతుంది

 దీంతో దర్శక నిర్మాతలు లబోదిబో మంటున్నారు.పైరసీని  అంతం చేయడానికి పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టిన పైరసీ  రోజురోజుకు పెరిగిపోతోంది. ఎన్నో కోట్లు వెచ్చించి ఎంతో కష్టపడి సినిమాలు తీసిన తర్వాత పైరసీగాళ్ళు  సినిమాను  పైరసీ చేస్తూ సొమ్ముచేసుకుంటున్నారు. దీంతో దర్శక నిర్మాతలకు లబోదిబో మంటున్నారు  . ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో పైరసీ  ప్రభావం మరీ ఎక్కువగా అయిపోయింది. చిన్న  సినిమాల మంచి పెద్ద సినిమాల వరకు అన్ని సినిమాల పైరసీ సిడిలు చేసేస్తున్నారు. ఇక్కడ ఓ  హీరోకి అలాంటిదే జరిగింది. 

 

 

 సినిమా మీద తనకున్న ఆసక్తితో 40 లక్షలు ఖర్చు ఓ సినిమాని తెరకెక్కించారు. సెన్సార్ బోర్డ్ నుంచి ఈ సినిమాకు సర్టిఫికెట్ కూడా వచ్చేసింది. ఇంకేముంది ఆనందంగా సినిమాను విడుదల చేయొచ్చు అనుకుంటున్న తరుణంలో ఈ సినిమా ఆన్లైన్ లో ప్రత్యక్షమయ్యింది. విడుదలకు ముందే సినిమాలు ఆన్లైన్లో ప్రత్యక్షం కావడంతో చిత్రబృందం ఆశ్చర్యానికి ఒకింత షాక్కి గురైంది. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలియాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే... నానిగాడు అనే సినిమా హీరో దుర్గాప్రసాద్ హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ నిరసన వ్యక్తం చేశారు. 40 లక్షలతో ఎంతో కష్టపడి తాము సినిమా తీశామని... కానీ విడుదలకు ముందే ఆన్లైన్ లోకి రావడంతో తమకు భారీగా నష్టం జరిగిందని తెలిపారు. 

 

 

 

 సెన్సార్ నుంచి యు సర్టిఫికేట్ పొందిన తమ సినిమా ఇంకొన్ని రోజుల్లో విడుదల కాబోతుంది అనే ఆనందంలో ఉన్న తమ  సినిమా ఆన్లైన్లో కనిపించడంతో షాక్కి గురయ్యానని... తమకు న్యాయం చేయాలంటూ ఫిలిం ఛాంబర్ ముందు నిరసన వ్యక్తం చేశారు. తమ సినిమాను ఆన్లైన్లో పెట్టిన నిందితులను గుర్తించి శిక్షించడం తో పాటు తమ సినిమాను ఆన్లైన్ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఫిలిం ఛాంబర్ ముందే ఆత్మహత్య చేసుకుంటానని   హెచ్చరించారు. ఇక అన్నట్టుగానే తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కాగా  హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు అతన్ని ఆసుపత్రికి తరలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: