దిశ అత్యాచార హత్య ఘటనలో నిందితులను తెలంగాణ పోలీసులు ఎన్కౌంటర్ చేయడంతో ఆ వార్త విన్న ప్రజలు చాలా మంది దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ పోలీసులు ఆ నలుగురు మృగాలకు నిందితులకు సరైన శిక్ష విధించారని చాలామంది దేశంలో ఉన్న వివిధ రాష్ట్రాలకు చెందిన రాజకీయ నేతలు తెలంగాణ గవర్నమెంట్ పై మరియు పోలీసు వ్యవస్థపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇటువంటి నేపథ్యంలో దిశ నిందితులను ఎన్కౌంటర్ చేయడం ఘటన విషయంలో ఎన్. హెచ్ .ఆర్. సి రంగంలోకి దిగడంతో NHRC బృందం సభ్యులు ఎన్ కౌంటర్ లో పాల్గొన్న తెలంగాణ పోలీసులను ఇటీవల విచారించడం జరిగింది. అసలు ఎందుకు ఎన్కౌంటర్ చేయాల్సి వచ్చింది ఎటువంటి పరిస్థితుల్లో చేయాల్సి వచ్చింది అనేక విషయాలపై NHRC బృందం సభ్యులు ఇటీవల ఎన్కౌంటర్ చేసిన పోలీసులను ప్రశ్నించడం జరిగింది.

 

ఇదే క్రమంలో ఈ ఘటనలో మెయిన్ ఆఫీసర్ సైబరాబాద్ సీపీ సజ్జనార్… మొత్తం జరిగిన ఎన్కౌంటర్ గురించి సుప్రీంకోర్టు విచారణకు హాజరై అసలు ఎందువల్ల ఎన్కౌంటర్ చేయాల్సిన పరిస్థితులు వచ్చాయి వంటి విషయాలను అత్యున్నత న్యాయస్థానానికి కోర్టు కి తెలపడం జరిగింది. దీంతో ఒక పక్క దేశంలో ఆడవాళ్లపై అత్యాచారాలు హత్యలు పెరిగిపోతున్న తరుణంలో తెలంగాణ పోలీసులు చేసిన ఎన్కౌంటర్ పట్ల హర్షం వ్యక్తమవుతోంది మరోపక్క మానవ హక్కుల అంటూ ఈ ఎన్కౌంటర్ విషయమై చేసిన పోలీసుల కెరియర్ సుప్రీం కోర్టుకు వెళ్లడంతో దేశంలో చాలా మంది సామాన్య జనులు చట్టాలు మారాలని న్యాయస్థానాలు కూడా ఆడపిల్లల అత్యాచారాలపై సరికొత్త చట్టాలు తీసుకురావాలని ఈ విధంగా మంచి చేసినా అధికారులను న్యాయస్థానానికి పిలవడం సమంజసం కాదని కామెంట్స్ చేస్తున్నారు.

 

మరోపక్క ఇటువంటి కామెంట్లు వస్తుండగానే దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం ఎన్ కౌంటర్ పై విచారణ ప్రారంభించింది. రిటైర్డు జడ్జితో విచారణ జరిపిస్తున్నామని సుప్రీంకోర్టు తెలిపింది. ఎన్ కౌంటర్ పూర్తి సమాచారం తమ వద్ద ఉందని సుప్రీంకోర్టు తెలిపింది. దీంతో దేశం మొత్తం సుప్రీంకోర్టు న్యాయస్థానం తీసుకున్నా నిర్ణయంపై మెజార్టీ ప్రజలు ఉలికి పడ్డారు. అటువంటి దుర్మార్గులకు తగిన శిక్ష విధిస్తే సుప్రీంకోర్టు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏమిటి అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: