అరకులోయ ప్రాంతంలో ప్రస్తుతం ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ జరుగుతున్న ప్రాంతం నుండి లీక్ అయిన వీడియో విషయాన్ని ‘ఆర్ ఆర్ ఆర్’ నిర్మాతలు చాల సీరియస్ గా తీసుకుని ఆలీక్ వ్యవహారం ఎలా జరిగింది అన్నవిషయంలో లోతైన విచారణ చేస్తున్నారు. ఇప్పటికే ఈలీక్ వీడియో లో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ లుక్ వైరల్ కావడంతో ఆ లీక్ వీడియో క్లిపింగ్ కాని దానికి సంబంధించిన ఫోటోలు కానీ ఎక్కడ సోషల్ మీడియాలో కనపడనీయకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవడమే కాకుండా ఈషూటింగ్ స్పాట్ దగ్గర మరింత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది.

ఈపరిస్థితులు ఇలా కొనసాగుతూ ఉంటే ఈలీక్ వీడియోలో బయటపడిన జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ లుక్ చెప్పుకోతగ్గ గొప్పగా లేదనీ చరణ్ అభిమానులు కొందరు జూనియర్ అభిమానులను రెచ్చ గొడుతూ కొందరు కామెంట్స్ పెడుతున్నారు. అంతేకాదు ఈమూవీలో జూనియర్ పాత్రకన్నా చరణ్ పాత్ర పెద్దది అనీ చరణ్ అలియా భట్ ల మధ్య రాజమౌళి ఇప్పటికే తీసిన ఒకపాటలో చరణ్ డాన్సింగ్ మూమెంట్స్ తో ‘ఆర్ ఆర్ ఆర్’ ధియేటర్లలోని ప్రేక్షకుల ఈలలు చప్పట్లతో ధియేటర్లు హోరెత్తిపోతాయి అంటూ కొందరు చరణ్ అభిమానులు జూనియర్ అభిమానులను కవ్విస్తూ కామెంట్స్ పెడుతున్నారు. 

ఈకామెంట్స్ జూనియర్ అభిమానుల దృష్టివరకు వెళ్ళడంతో వారు తీవ్ర అసహనంలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కేవలం ‘ఆర్ ఆర్ ఆర్’ కు సంబంధించి చిన్న వీడియో షూటింగ్ స్పాట్ నుండి లీక్ అయితేనే ఇంత రగడ జరుగుతున్న నేపధ్యంలో భవిష్యత్ లో ‘ఆర్ ఆర్ ఆర్’ విడుదల అయ్యాక చరణ్ జూనియర్ అభిమానులు ఈమూవీలో రాజమౌళి చరణ్ జూనియర్ ల పాత్రల మధ్య సమతూకం పాటించలేకపోతే తమ హీరోలకు రాజమౌళి అన్యాయం చేసాడు అంటూ ఎలారభసకు దిగుతారో అన్న విషయానికి ఈచిన్న సంఘటన ఉదాహరణ అంటూ కొందరు అభిప్రాయ పడుతున్నారు.

వాస్తవానికి రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీలో అల్లూరి సీతారామరాజు కొమరం భీమ్ పాత్రలు కనిపిస్తాయి కానీ జూనియర్ చరణ్ లు కనిపించరు. వారిద్దరి పాత్రల మధ్య ఈమూవీలో సమతూకం ఉండదు అంటూ ఇప్పటికే క్లారిటీ ఇచ్చాడు. అయితే ఈక్లారిటీని జూనియర్ చరణ్ అభిమానులు పట్టించుకోరు అని చెప్పడానికి ఈసంఘటన చిన్న ఉదాహరణ మాత్రమే అనుకోవాలి..   

 

మరింత సమాచారం తెలుసుకోండి: