సినిమాల్లో ఒకోసారి కొన్ని పాత్రలు అందరి హీరోలూ చేయాల్సి ఉంటుంది. ఒకోసారి యాదృచ్చికంగా ఒకరిద్దరు హీరోలు ఒకేసారి ఆయా పాత్రలు చేయాల్సి వస్తుంది. ఇది పోటీ పడటం అనేకంటే ఆయా కథలు, అందులోని పాత్రలను రాసుకున్న రచయితల సృష్టి అని చెప్పాలి. ఒక్కో కథలో ఒక్కో పాత్ర  కథ ప్రాధాన్యాన్ని బట్టి వాటి రూపు మారుతుంది. అలా అనుకోకుండా ఒకే తరహా పాత్రను ఇద్దరు కథానాయకులు ఒకేసారి వేయాల్సి వచ్చింది. వారిద్దరిలో ఒకరు సూపర్ స్టార్ మహేశ్ అయితే మరొకరు నాగ చైతన్య.

 

 

వీరిద్దరూ తాము నటించగా విడుదలకు సిద్ధమయిన సరిలేరు నీకెవ్వరు, వెంకీ మామ సినిమాల్లో నటించారు. రెండింటిలోనూ వీరిద్దరూ మిలిటరీ ఆఫీసర్లుగా నటించిన విషయం తెలిసిందే. అయితే.. ఇందులో నాగ చైతన్య సినిమా వెంకీ మామ మరో రెండు రోజుల్లో విడుదల కానుంది. ముందుగా రావడం వల్ల మిలిటరీ ఆఫీసర్ క్యారెక్టర్ పై ప్రేక్షకులు ఓ అంచనాకు వచ్చే అవకాశం ఉంది. ఇద్దరి మెకోవర్ లో మిలిటరీ అధికారిగా  గెడ్డంలోనే కనిపిస్తున్నారు. ఇద్దరూ మిలటరీ నుంచి వచ్చి వారి కుటుంబాలతో గడుపే పాత్రలే చేస్తున్నారు. కాకపోతే ఇద్దరికీ క్రేజ్ విషయంలో చాలా గ్యాప్ ఉంది. కథలో వెరీయేషన్లు కామన్ గానే ఉంటాయి.

 

 

ఈ నేపథ్యంలో ముందుగా వచ్చే వెంకీ మామలో నాగ చైతన్య పాత్ర ఇంపాక్ట్ మహేశ్ పడుతుందా అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. రెండూ కుటుంబ నేపధ్యం ఉన్న సినిమాలు కవడంతోనే ఈ తరహా వాఖ్యలు వస్తున్నాయి. రెండూ పెద్ద హీరోల సినిమాలు కావడం మరో విశేషం. మరి ఈ రెండు సినిమాల్లో మిలిటరీ అధికారిగా ఎవరి పాత్ర మెప్పిస్తుందో చూడాలి. వెంకీ మామ డిసెంబర్ 13న రిలీజ్ అవుతూండగా.. సరిలేరు నీకెవ్వరు వచ్చే సంక్రాంతికి జనవరి 11న విడుదలవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: