ఈ మద్య దేశ వ్యాప్తంగా గన్ కల్చర్ విపరీతంగా పెరిగిపోయింది.  లైసెన్స్ గన్స్  సెలబ్రెటీలు, రాజకీయ నేతలు, ప్రముఖ వ్యాపారులు మెయింటేన్ చేస్తుంటారు..అక్రమ ఆయుధాలు కలిగిన వారు ఎంతో మంది ఉన్నారు.  అయితే పోలీసులు ఎన్ని కట్టుదిట్టాలు చేస్తున్నా అక్రమ ఆయుధాలు కలిగిన వారికి అడ్డుకట్ట వేయలేక పోతుంది.  దాంతో చిన్న విషయాలకు కూడా కొంత మంది గన్ ఉపయోగించడం.. కాల్చి వేయడం చూస్తూనే ఉన్నాం.  ఇటీవల హైదరాబాద్ నగరంలో గన్ ఫైరింగ్ కేసులు ఎన్నో వస్తున్నాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు... గ్యాంగ్ వార్స్ అక్కడ ఎక్కువగా జరుగుతుంటాయి.  ముంబాయి లాంటి మహానగరాల్లో గన్ కల్చర్ విచ్చలవిడిగా పెరిగిపోయింది.  

 

తాజాగా బీహార్ లో సమస్తీపూర్ జిల్లాలో కొందరు దుండగులు భోజ్‌పురి నటుడిని తుపాకీతో కాల్చిచంపారు. ఈ ఘటన ముఫ్ఫసిల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. దీంతో ఆయ‌న రక్త‌పు మ‌డుగులు కొట్టుమిట్టాడుతూ క‌నిపించారు. వెంట‌నే స్థానికులు మిథిలేష్‌ని ఆసుప‌త్రికి త‌ర‌లించ‌గా, చికిత్స పొందుతూ క‌న్నుమూశారు. వివరాల్లోకి వెళితే.. ప్రముఖ నటులు మిథిలేష్ పాశ్వాన్ త‌న వాహ‌నంపై ఆధార్ పూర్ గ్రామానికి వెళుతున్నాడు.  ఆయన  ఖాదీ భండార్ కు చేరుకోగానే.. బైక్ పై వచ్చిన కొందరు దుండగులు మిథిలేష్ వాహనాన్ని ఓవర్ టేక్ చేస్తూ ఆపారు.

 

బైక్ పై వచ్చిన దుండగులు మిథిలేష్ పాశ్వాన్ వాగ్వాదానికి దిగారు ఇంతలో వారిలో ఒక వ్యక్తి ఉన్నట్టుండి మిథిలేష్ పై కాల్పులు జరిపాడు. గాయాల పాలైన ఆయన తీవ్ర రక్తస్రావంతో రక్తపు మడుగులో కొట్టుకోవడం అక్కడ ఉన్న స్థానికులు గమనించారు. వెంటనే ఆ దుండగులు అక్కడ నుండి పారిపోయారు. స్థానికులు మిథిలేష్ ని హాస్పిటల్ కి తరలించగా.. అతడు చికిత్స పొందుతూ మరణించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నటుడు మృతితో బోజ్ పూరి ఇండస్ట్రీ శోక సంద్రంలో మునిగిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: