తెలుగు ప్రేక్షకులకు అర్జున్ రెడ్డి సినిమా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో  అడ్డంకులను దాటుకుని ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ వచ్చిన తర్వాత ఈ సినిమా తెలుగు సినీ చరిత్రలో ఒక మైలురాయి సినిమాగా నిలిచింది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ నటన వేరే స్థాయిలో ఉంది అని విమర్శించే వాళ్ళు కూడా ప్రశ్నించే లాగా చేశాడు. అలాగే ఈ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన హిందీ భామ శాలిని పాండే కూడా మంచి నటన చేసింది. 

 

కానీ, ఆ తర్వాత విజయ్ దేవరకొండ సాధించిన స్థాయిని ఈ అందాలభామ అందుకోలేదని చెప్పాలి. మహానటి సినిమాలో కీర్తి సురేష్ ఫ్రెండ్ గా నటించింది ఈ భామ. ఆ తర్వాత కళ్యాణ్ రామ్ తో ఒక సినిమాలో నటించింది. ఆ సినిమా కథా పరంగా బాగా ఉన్న కలెక్షన్లు మాత్రం అంత అంత మాత్రమే వచ్చాయి. ఆ తర్వాత కోలీవుడ్లో ఈ భామ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.

 

Image

 

అక్కడ తెలుగులో ఏడు సంవత్సరాల కిందట వచ్చిన 100 % లవ్ రీమేక్ చిత్రంలో నటించింది. అక్కడ తెలుగులో తమన్నా చేసిన మాయ తిరిగి పునరావృతం చేయలేకపోయింది ఈ ముద్దుగుమ్మ. మొదటి సినిమాలోనే చుంబన సీన్లలో లీనమై నటించిన ఈ అందాల భామ ఎక్స్పోజింగ్ విషయంలో ఏ మాత్రం తగ్గదు.

 

 ఇప్పుడు ఈ భామ బాలీవుడ్ లో బంపర్ జాక్ పాట్ కొట్టింది అని చెప్పాలి. యశ్ రాజ్  ఫిలిమ్స్ నిర్మిస్తున్న జయేష్ భాయ్ జోర్దార్ అనే సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమాలో హీరోగా  బాలీవుడ్ హాటెస్ట్ హీరో రణ్వీర్ సింగ్ సరసన నటించే అవకాశం కొట్టేసింది. నిజానికి ఇది ఆమె కెరీర్ కి ఎంతో గొప్ప విషయం అని చెప్పాలి చాల తక్కువ కాలంలో మంచి బ్యానర్ లో సినిమా చేసే అవకాశం వచ్చింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: