స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రం కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీగా వస్తున్న సినిమా అల వైకుంఠపురములో. అల్లు అర్జున్ సరసన పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన ఈ సినిమాలోని 3 సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. కొద్ది నిమిషాల క్రితం అల వైకుంఠపురములో టీజర్ రిలీజైంది. టీజర్ చూస్తే త్రివిక్రం మార్క్ కనిపిస్తుంది.

 

ముఖ్యంగా అల్లు అర్జున్ లుక్ అదిరిపోయింది. త్రివిక్రం సినిమా అంటే మాటల తూటాలు కామనే.. ఈ సినిమాలో మరోసారి త్రివిక్రం తన పెన్ పవర్ ఏంటో చూపించాడని అనిపిస్తుంది. ఇక ఫైట్లు, డ్యాన్సులు బోనస్ అన్నమాట. సినిమా కథకు తగినట్టుగా బన్ని లుక్.. సినిమాలో హీరోయిన్ పూజా గ్లామర్ కూడా స్పెషల్ ఎట్రాక్షన్ కానుంది. ఇక సుశాంత్ కూడా టీజర్ లో సర్ ప్రైజ్ లుక్ లో కనిపించాడు. ఇక ఈ సినిమా టీజర్ అదిరిపోయేలా ఉంది.

 

సినిమా కోసం ఎక్సైటింగ్ గా ఎదురుచూసేలా ఈ సినిమా టీజర్ ఉందని చెప్పొచ్చు. వైకుంఠపురములో అమ్మాయి మనసు గెలిచేందుకు అల్లు అర్జున్ ఏం చేశాడు అన్నది సినిమా కథ. చూస్తుంటే జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాల మాదిరిగా అల్లు అర్జున్, త్రివిక్రం కాంబోలో మరో సెన్సేషనల్ హిట్ కొట్టేలా ఉన్నారు. అల వైకుంఠపురములో టైటిల్ తోనే సగం మార్కులు కొట్టేయగా మ్యూజిక్ తో మరింత క్రేజ్ ఏర్పడేలా చేశాడు. ఇక సినిమా టీజర్ లో నువ్విప్పుడే కారు దిగావ్.. నేనిప్పుడే క్యారక్టర్ ఎక్కా అని బన్ని చెప్పిన డైలాగ్ అయితే కేక అని చెప్పొచ్చు. సినిమా మీద అంచనాలు భారీగా ఏర్పడగా సంక్రాంతి పందెం కోడిగా వస్తున్న బన్ని ఎలాంటి సంచలన విజయం అందుకుంటాడో చూడాలి. ఇప్పటికే ఈ సినిమా అదిరిపోయే బిజినెస్ చేస్తుంది. బన్ని కెరియర్ లో హయ్యెస్ట్ బిజినెస్మూవీ చేస్తుందని టాక్. 

మరింత సమాచారం తెలుసుకోండి: