తెలుగు సినిమా ఇండస్ట్రీ లోనే అత్యంత సీనియర్ నటుడు అయిన బాలకృష్ణ ఇప్పుడు ఇండస్ట్రీలో తన ఉనికి కోసం పడుతున్న పాట్లు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ దశలో ఎన్నో సినిమాలు ఆపకుండా తన అభిమానుల్ని అల్లరిద్దాం అనే బాలయ్య తపనకు ప్రస్తుతం తగినంత మద్దతు తెలుగు ప్రేక్షకులు ఇవ్వడం లేదు అనే చెప్పాలి. నందమూరి బాలకృష్ణ తదుపరి చిత్రమైన రూలర్ ఈ నెల 20వ తేదీన రిలీజ్ కానుంది. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ మరియు టీచర్ మీద ఇప్పటికే ఎన్నో ట్రోల్స్ వచ్చాయి. బాలయ్య తన స్టైలిష్ లుక్ తో కొంతమందిని ఆకట్టుకున్నా అతను చేసిన ఇంకొక పోలీస్ రోల్ మాత్రం చాలా రొటీన్ గా ఉందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.

 

క్రిస్మస్ సీజన్ లో దాంతోపాటు చాలా మంచి చిత్రాలు విడుదల అవుతున్న కారణంగా డిస్ట్రిబ్యూటర్ల దగ్గర నుంచి కూడా పెద్దగా ఆఫర్స్ ఏమీ లేవు. అదీ కాకుండా సినిమా షూటింగ్ సమయం అనుకున్నదానికన్నా ఎక్కువ జరగడంతో బడ్జెట్ అనుకున్నదాని కన్నా చాలా ఎక్కువ పెరిగిపోయింది. ఇప్పుడు కొత్తగా వచ్చిన అప్డేట్ ఏమిటంటే దాదాపు 15 కోట్ల రూపాయల నష్టం తో బాలయ్య బాబు సినిమా రిలీజ్ కానుంది. థియేట్రికల్ మరియు నాన్ థియేట్రికల్ రైట్స్ లో కూడా ప్రొడ్యూసర్లు కనీసం మొత్తాన్ని రాబట్టుకోవాలి లేకపోవడంతో వారు పెద్ద రిస్క్ ను తీసుకోబోతున్నారు. 

 

సినిమా ఎవరూ ఊహించని విధంగా అతి భారీ విజయం సాధిస్తే తప్ప వారికి వచ్చే నష్టం పూడ్చలేనిదని సినీ విశ్లేషకుల అంచనా. ఈ సినిమాతో పాటు సాయి ధరమ్ తేజ్ 'ప్రతి రోజు పండగే' మరియు కార్తీ 'దొంగ' అదే రోజున విడుదల కావడం మరొక దెబ్బ. బాలకృష్ణ ఇంతకుముందు సినిమాలు కూడా అనుకున్న స్థాయిలో ఆడకపోవడంతో చాలా ప్రముఖ వెబ్ సైట్లు మరియు ఇండస్ట్రీ వర్గాలు ఇకపై బాలయ్య సినిమాలు ఆపేయడం మంచిదని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న బాలయ్య ఇప్పుడు రూలర్  సినిమాతో వారికి సరైన రెస్పాన్స్ ఇస్తాడో లేదో చూద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి: