బాలీవుడ్ ఇండస్ట్రీలో కండలవీరుడు సల్మాన్ ఖాన్ ఒకానొక సమయంలో ఐశ్వర్య రాయ్ తో ప్రేమలో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఒక వివాదం తలెత్తిన సందర్భంలో అందరి ముందు ఐశ్వర్యరాయ్ ని సల్మాన్ ఖాన్ కొట్టడం జరిగింది. దీంతో ఈ వార్త అప్పట్లో 2000 సంవత్సరంలో పెద్ద సంచలనమైంది. ఆ తర్వాత వెంటనే ఐశ్వర్యరాయ్ సల్మాన్ ఖాన్ పై కోపంతో అప్పట్లో బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి ఫామ్ లో అమ్మాయిలను ఆకర్షించే విధంగా మంచి మంచి సినిమాలు తీసి మంచి జోరు మీద ఉన్న హీరో వివేక్ ఒబెరాయ్ తో సల్మాన్ పై కోపంతో ఐశ్వర్యరాయ్ ప్రేమలో పడటం జరిగింది. దీంతో ఈ విషయం తెలుసుకున్న కండలవీరుడు సల్మాన్ ఒకరోజు...ఫుల్లుగా తప్పతాగి వివేక్ ఒబెరాయ్ కి ఫోన్ చేసి బండ బూతులు తిట్టి చంపేస్తాను అని వార్నింగ్ ఇస్తూ సల్మాన్ మాట్లాడటంతో తర్వాత రోజు అనగా 2003వ సంవత్సరం ఏప్రిల్ ఒకటవ తారీఖున వివేక్ ఒబెరాయ్ భయపడిపోయే మీడియా సమావేశం పెట్టి ఆ మీడియా సమావేశంలో సల్మాన్ ఖాన్ తన పై తిట్టిన భూతులను అలాగే చంపేస్తానంటూ ఇచ్చిన వార్నింగ్ ఇంకా అనేక విషయాలను వివేక్ ఒబెరాయ్ చెప్పుకు రావడం జరిగింది.

 

ముఖ్యంగా నువ్వు రోజుకో అమ్మాయితో పడుకుంటావు… నీకు ఐశ్వర్యరాయ్ అవసరమా అంటూ సల్మాన్ ఖాన్ తనపై విమర్శలు చేసిన విమర్శలను బయట పెట్టడంతో ఆ సందర్భంలో ఉన్న మీడియా సల్మాన్ ఖాన్ ని గట్టిగా టార్గెట్ చేసింది. ఇదే తరుణంలో మీడియా సమావేశం పెట్టి మాట్లాడిన నటుడు వివేక్ ఒబెరాయ్ పై అప్పట్లో బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న నటీనటులు సీరియస్ అవ్వడం జరిగింది. అదే తరుణంలో మీడియా సమావేశంలో ఐశ్వర్యరాయ్ పేరు వివేక్ ఒబెరాయ్ తీసుకురావడంతో ఐశ్వర్యరాయ్  వివేక్ కు బ్రేకప్ చెప్పింది.

 

తర్వాత వివేక్ ఒబెరాయ్ కి బాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలు రావడం తగ్గుముఖం పట్టడంతో సల్మాన్ ఖాన్ కి చాలా సార్లు క్షమాపణలు చెప్పిన సల్మాన్ ఇప్పటివరకు వివేక్ ఒబెరాయ్ చెప్పిన సంజాయిషీ కి ఒప్పుకున్నా దాఖలాలు లేవు. ఇది ఎప్పుడో 15 సంవత్సరాల క్రితం జరిగిన గొడవ అయినా గాని తాజాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సంఘటనతో వివేక్ ఒబెరాయ్ చాలా వరకు తన కెరియర్ డ్యామేజ్ చేసుకోవడం జరిగిందని సన్నిహితులు కామెంట్ ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: