స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో పాటల విడుదల తరువాత ఈ చిత్రంపై అంచనాలు ఆకాశానికి చేరాయి. దీనితో అలవైకుంఠపురంలో మూవీకి సంబంధించిన ఏ అప్డేట్ ఐనా హాట్ టాపిక్ లా మారుతుంది. కాగా బుధ‌వారం ఈ సినిమాకు సంబంధించిన టీజ‌ర్ రిలీజ్ అయ్యింది. త్రివిక్రమ్-బన్నీ కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ కావ‌డంతో అలవైకుంఠపురంలో సినిమాపై మంచి అంచ‌నాలు ఉన్నాయి.

 

బన్నీ ఈ సినిమాలో మధ్యతరగతి కుటుంబానికి చెందిన సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ గా కనిపిస్తున్నాడు. ఇక హీరోయిన్ పూజా హెగ్డే బ‌న్నీ ప‌నిచేసే ఆఫీస్ హెడ్ గా అతనికి లేడీ బాస్ రోల్ చేస్తున్నారు. ఇక తాజాగా రిలీజ్ అయిన టీజ‌ర్ మ‌రీ కొత్త‌గా కాక‌పోయినా త్రివిక్ర‌మ్ పాత సినిమాల‌ను గుర్తు చేస్తోంది. ఇక ఈ సినిమాలో బ‌న్నీ త్రివిక్ర‌మ్ స్టైల్లో కొన్ని పంచ్ డైలాగులు వేశాడు. రౌడీలను స్టైల్ గా చితక్కొడుతూ "స్టైల్ గా ఉంది కదా? నాక్కూడా నచ్చింది" అంటాడు. 

 

ఆ త‌ర్వాత సినిమానుంచి వరసబెట్టి పాటలు రిలీజ్ చేస్తూపోతున్నారు.. అనే దానికి సెటైర్ కూడా వేసుకున్నారు. సుశాంత్ "సంథింగ్ కంప్లీట్ అవ్వట్లేదు" అంటాడు.. దానికి బదులుగా "అమ్మ.. ఇన్ని పాటలతో ప్యాక్ చేశాక.. డైలాగు లే కదా? " అంటూ సెటైర్ వేసుకుంటాడు. బ‌న్నీ వేసిన ఈ సెటైర్ సంక్రాంతికి బ‌న్నీ, మ‌హేష్ సినిమాల మ‌ధ్య వార్ నేప‌థ్యంలో వేసిందా ?  లేదా ? త‌న సినిమా మీద తానే వేసుకున్నాడా ? అన్న దానిపై చ‌ర్చ‌లు స్టార్ట్ అయ్యాయి. 

 

ఈ రెండు సినిమాల పోటీ నేప‌థ్యంలో వ‌రుస‌గా రెండు సినిమాల టీజ‌ర్లు, ట్రైల‌ర్లు, సాంగ్స్ రిలీజ్ చేసుకుంటూ పోతోన్న సంగ‌తి తెలిసిందే. ఇక అల వైకుంఠ‌పురంలో సీనియర్ హీరొయిన్ టబు, హీరో సుశాంత్ లతో పాటు నివేదా పేతురాజ్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ మరియు గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తుండగా వచ్చే ఏడాది జనవరి 12న విడుదల అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: