జబర్ధస్త్ కామెడీ షోతో ఎంతో మంది నటులు పాపులర్ అయ్యారు. అలాంటి వారిలో సుడిగాలి సుధీర్ ఒకరు. జబర్ధస్త్ తో ఎంతో మంది ఔత్సాహిక కళాకారులు వెలుగులోకి వచ్చారు. జబర్ధస్త్ లో టీమ్ లీడర్ గా ఎదిగారు. ఏడేళ్ల నుంచి ఎన్నో అద్భుతమైన స్కిట్స్ తో తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు. సుడిగాలి సుధీర టీమ్ లో గెటప్ శీను, ఆటో రాంప్రసాద్, సన్నీ ఈ ముగ్గురు కలిసి ఇప్పటి వరకు ఎన్నో స్కిట్స్ చేశారు. తన అల్లరి, కామెడీ టైమింగ్‌తో అదరగొడుతున్నాడు సుధీర్. ఆయన ఓ పక్క 'జబర్దస్త్' షోలో కామెడీ పండిస్తూనే.. మరో వైపు 'ఢీ' డాన్స్ షోలో యాంకరింగ్, టీమ్ లీడర్‌గా రాణిస్తున్నాడు. ఆ మద్య జబర్ధస్త్ లో యాంకర్ రష్మీతో మనోడికి ఎఫైర్ ఉందని తెగ వార్తలు వచ్చాయి.. కానీ రష్మి తన ఫ్రెండ్ అని మాత్రమె చెబుతున్నాడు.
ప్రస్తుతం సుధీర్ హీరోగా కూడా నటిస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన చిన్ననాటి క్యూట్ లవ్ స్టోరీ గురించి చెప్పారు. సాధారణంగా చిన్నతనంలో అంటే నేను అప్పుడు 5 వ క్లాసు చదువుతున్నాను.. ఆ సమయంలో ఒక అమ్మాయికి లైన్ వేశానని.. అయితే ఎక్కువ సార్లు ఆ అమ్మాయితో మాట్లాడితే తనతో నాకు మంచి స్నేహం ఉందని లింకులు పెడతారని అలా చేసేవాడినని అన్నాడు. అయితే కొన్నిరోజులకు ఆ అమ్మాయిని తాను కూడా ఇష్టపడ్డట్లు తెలిపాడు.
కాకపోతే ఈ విషయం ఆ అమ్మాయికి నేను 9 క్లాస్ వచ్చాక చెప్పాను.. అందుకు ఆ అమ్మాయి కూడా నన్ను ఇష్టపడింది. ఇక్కడ ట్విస్ట్ ఏమంటే.. ఈ విషయం సుధీర్ ప్రేమించిన అమ్మాయి వాళ్లింట్లో తెలవడంతో గొడవలు అయ్యాయని తెలిపాడు. ఇక ఆ దెబ్బతో స్కూల్లో అప్పటినుండి అబ్బాయిల్ని, అమ్మాయిల్నీ విడివిడిగా వేర్వేరు తరగతుల్లో కూర్చోబెట్టేవారని తన క్యూట్ లవ్ స్టోరి చె్ప్పాడు.