టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఒక్కొక్కటిగా అవకాశాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం అతడి చేతిలో వరల్డ్ ఫేమస్ లవర్ తో పాటు, మైత్రి మూవీ మేకర్స్ వారి నిర్మాణంలో ఆనంద్ అన్నామలై తెరకెక్కిస్తున్న సినిమాలు ఉన్నాయి. కాగా వీటి తరువాత టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో భారీ రేంజ్ లో అతి త్వరలో పాన్ ఇండియా మూవీ చేయబోతున్న విజయ్ కు లేడీస్ లో కూడా విపరీతంగా క్రేజ్ ఉంది. 

 

ఇకపోతే ప్రస్తుతం నటిస్తున్న వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో విజయ్ ఏకంగా నలుగురు హీరోయిన్స్ తో రొమాన్స్ చేయబోతున్నాడు. ఐశ్వర్య రాజేష్, ఇజాబెల్లె, క్యాథరిన్ థెరిస్సా, రాశి ఖన్నాలు ఈ సినిమాలో విజయ్ సరసన హీరోయిన్స్ గా నటిస్తున్నారు. కాగా ఈ సినిమా యూనిట్ కాసేపటి క్రితం ఒక ఆసక్తికరమైన ప్రకటనను రిలీజ్ చేసింది. ఆ ప్రకటన ప్రకారం, రేపటి నుండి అనగా, 12, 13, 14, 15 వ తేదీల్లో వరుసగా సాయంత్రం 6 గంటల 3 నిమిషాలకు ఒక్కొక్క హీరోయిన్ తాలూకు ఫస్ట్ లుక్ పోస్టర్స్ ని రిలీజ్ చేయబోతున్నట్లు సినిమా యూనిట్ ప్రకటించింది. 

 

అర్జున్ రెడ్డి తరహాలోనే విజయ్ కొంత భగ్న ప్రేమికుడిగా కనిపించబోయే ఈ సినిమా, మంచి రొమాంటిక్, యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్నట్లు టాక్. కె ఎస్ రామారావు సమర్పణలో కేఏ వల్లభ నిర్మాతగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా, లవర్స్ డే కానుకగా ఫిబ్రవరి 14వ ప్రపంచ వ్యాప్తంగా భారీ రేంజ్ లో రిలీజ్ కాబోతోంది. యువ సంగీత దర్శకుడు గోపి సుందర్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాకు జయకృష్ణ గుమ్మడి సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నాడు. ఇటీవల వరుసగా కొంత అపజయాలను చవిచూస్తున్న విజయ్ కు, ఈ సినిమా ఎంతమేర సక్సెస్ ని అందిస్తుందో చూడాలి......!!

మరింత సమాచారం తెలుసుకోండి: