తెలుగులో పరిచయమైన ఏ హీరోయిన్ అయినా ఇక్కడ సక్సస్ అవడానికే చాలా సమయం పడుతుంది. కనీసం ఓ నాలుగు ఐదు సినిమాలు ఛాన్స్ వచ్చి అవి సూపర్ హిట్టైతే గాని మిగతా భాషల్లో అవకాశాలు తలుపు తట్టవు. ముఖ్యంగా బాలీవుడ్ లో సినిమా ఛాన్స్ రావాలంటే కాస్త కష్టమే. కానీ తెలుగులో తాజాగా వచ్చి హిట్ టాక్ తెచ్చుకున్న సినిమాలో హీరోయిన్ బాలీవుడ్ లో మంచి ఛాన్స్ వచ్చింది. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో జార్జ్ రెడ్డి సినిమా గురించి చాలా ఎక్కువ ప్రచారం జరిగిన విషయం తెల్సిందే. విడుదలకు ముందు చాలా హడావుడి చేసిన జార్జ్ రెడ్డి విడుదల తర్వాత ఎక్కువ రోజులు సందడి చేయలేక పోయింది. సినిమా అంతంత మాత్రంగానే ఆడినా కూడా ఆ సినిమాలో హీరోయిన్ గా నటించిన ముస్కాన్ ఖుబ్చందానికి మంచి గుర్తింపు దక్కింది. పాత సినిమాల్లో హీరోయిన్ తరహాలో మేకప్ తో ఆమె నాచురల్ గా కనిపించిన సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

 

జార్జ్ రెడ్డితో మంచి పేరు దక్కించుకున్న ఈ బ్యూటీకి ఇప్పుడు బాలీవుడ్ లో ఛాన్స్ దక్కింది. కాంచన సినిమాను రాఘవ లారెన్స్ ప్రస్తుతం హిందీలో లక్ష్మీ బాంబ్ టైటిల్ తో రీమేక్ చేస్తున్నాడు. అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ఇప్పటికే హీరోయిన్ గా కియారా అద్వానీ నటిస్తుంది. ఇక మరో కీలక పాత్రలో ముస్కాన్ నటిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ఈమెను జార్జ్ రెడ్డి సినిమా వీడియోల్లో చూసిన లారెన్స్ వెంటనే తన లక్ష్మీ బాంబ్ సినిమాలోని ఒక పాత్రకు ఎంపిక చేసినట్లుగా తాజా సమాచారం. 

 

తెలుగులో కూడా ముస్కాన్ కు చిన్న సినిమాలలో ఆఫర్లు వస్తున్నాయి. నటనలో మంచి ప్రావిణ్యం ఉండటంతో పాటు ఈ బ్యూటీకి అందం కూడా ఆకట్టుకునే విధంగా ఉండటం వల్ల తెలుగులో కూడా మంచి హీరోయిన్ గా పేరు దక్కించుకుంటుందనే నమ్మకం కలిగిస్తోంది. ఉత్తర ప్రదేశ్ కు చెందిన ఈ మోడల్ కమ్ హీరోయిన్ ముందు ముందు ఎలాంటి సినిమాల్లో చేయనుందో చూడాలి. ఇక బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ సినిమా అంటే ఖచ్చితంగా హిట్ అని ఫిక్సవ్వాల్సిందే. ఎందుకంటే గత రెండు సంవత్సరాలుగా అక్షయ్ ఫ్లాప్ ఎలా ఉంటుందో చూడలేదు. సామాజిక అంశాలున్న కథ ను ఎంచుకొని వరుసగా బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో నటిస్తున్నారు. అంతేకాదు ఈ మధ్య అక్షయ్ మార్కెట్ కూడా బాగా పెరిగింది. అలాంటి హీరో తో బాలీవుడ్ ఎంట్రీ అంటే ఏ హీరోయిన్ కైయినా గోల్డెన్ ఛాన్సే నని చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: