యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నారనే విషయం అందరికి విదితమే. జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటించగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు. ఎన్టీఆర్ సరసన ఒలీవియా మోరిస్, రామ చరణ్ సరసన ఆలియా భట్ హీరోయిన్ల గా నటిస్తున్నారు. హిందీ నటుడు అజయ్ దేవగన్ కూడా ఈ సినిమాలోని ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. అగ్ర దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు కలిస్తే ఎలా ఉంటుందో అనే ఊహాత్మక కథ నేపథ్యంలో ప్రజల ముందుకు రానుంది.


అయితే నిన్న అనగా డిసెంబర్ 10వ తారీఖున జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్ర షూటింగ్ కొరకు విశాఖ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు. అక్కడ ఉన్న ప్రయాణికులు జూనియర్ ఎన్టీఆర్ రాకను గమనించారు. ఆపై జై ఎన్టీఆర్ అంటూ తమ ఫేవరెట్ హీరోకి కరచాలనం చేయడానికి భద్రత సిబ్బందిని తోసుకుంటూ మరీ నానా హంగామా చేసారు. కొందరు మాత్రం ఎన్టీఆర్ అడుగడుగును వీడియో రికార్డు చేస్తూ, ఫోటోలు తీస్తూ స్మార్ట్ ఫోన్లలో బంధించారు. తర్వాత ఆ ఎయిర్ పోర్ట్ లుక్ కుుు సంబంధించిన ఫొటోస్ సామజిక మాధ్యమాలలో అప్లోడ్ అయ్యాయి.

 

https://mobile.twitter.com/NizamNTRFc/status/1204235900881952773

 

అలా అప్లోడ్ అయిన కొన్ని సెకనులలోనే విపరీతంగా చక్కర్లు కొట్టాయి. ఎంతగా ఆ ఫొటోస్ హల్చల్ చేసాయంటే... ట్విట్టర్ ఇండియా ట్రేండింగ్ లిస్ట్ లోకి కొద్ది సమయంలోనే టాప్ ప్లేస్ ని సంపాదించి రికార్డులన్నీ బ్రేక్ చేసింది. కేవలం ఒక యాక్టర్ ఎయిర్ పోర్ట్ లుక్ దేశవ్యాప్తంగా ట్విట్టర్ ట్రేండింగ్ లిస్ట్ లో టాప్ ప్లేస్ సంపాదించడం గమనార్హం. కాగా, నిన్న ఆర్ఆర్ఆర్ షూటింగ్ కు సంబందించిన ఒక వీడియో క్లిప్ లీక్ అయ్యి కొంత సమయం వరకు నెట్టింట హల్చల్ చేసింది. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ ఆ వీడియో క్లిప్ ని ఇంటర్నెట్ నుంచి పోలీసుల సహాయంతో దాదాపుగా తొలగించారు. కానీ కొంతమంది అప్పటికే వాట్సాప్ లలో షేర్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: