కంగన సిస్టర్ రంగోలి చందేల్ అంటే ఎవరికైనా హడలే. ఎప్పుడు ఏదో ఒక సెలబ్రిటిని టార్గెట్ చేసు కాంట్రవర్సిలు క్రియోట్ చేస్తుంటుంది. మొన్నా మధ్య తాప్సీని ఇలానే ఒక ఆట ఆడేసుకుంది. ఇప్పుడు  బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపక మీద ఇలానే కామెంట్స్ చేసింది. ఈ కామెంట్స్ ఇప్పుడు బాలీవుడ్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీపీకా పదుకొణె నటిస్తున్న తాజా చిత్రం `ఛపాక్`. యాసిడ్ బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవితంలో జరిగిన యదార్థ సంఘటనల నేపథ్యంలో మేఘనా గుల్జార్ ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమా ట్రైలర్ ను రీసెంట్‌గా రిలీజ్ చేశారు చిత్ర బృందం. ఈ సినిమాలో యాసిడ్ బాధితురాలిగా దీపిక కనిపించింది. మాలతి పాత్రలో ఆమె ప్రదర్శించిన నటనకు అందరి నుండి ప్రశంసలు దక్కుతున్నాయి. అయితే ప్రతి విషయాన్ని కాంట్రవర్సి చేస్తూ విమర్శలు గుప్పించే కంగన సిస్టర్ రంగోలి చందేల్ ఈ ట్రైలర్ పై ప్రశంసలు కురిపించడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ట్విట్టర్ వేదికగా రంగోలి దీపికపై ఛపాక్ ట్రైలర్ పై ప్రశంసల వర్షం కురిపించింది.

 

అద్భుతం ప్రతీ ఒక్కరు చూడాల్సిన చిత్రమిది. చాలా అద్భుతంగా వుంది. మేఘనా గుల్జార్ దీపికా పదుకొణెసినిమా ద్వారా చాలా మంది భావోద్వేగపూరితమైన ప్రశంసల్ని సొంతం చేసుకుంటారు. నాపై జరిగిన యాసిడ్ దాడి కారణంగా నేను నా కుటుంబం మరణం కన్నా ఘోరమైన బాధను అనుభవించాం. యాసిడ్ దాడి తరువాత ప్రాణాలతో బయటపడిన వారి కథ ఈ దేశం మొత్తం తెలుసుకోవాలి. ఈ దేశంలో అందరికి చేరాలని ప్రార్థిస్తున్నాను` అని రంగోలి చందేల్ సోషల్ మీడియా ట్విట్టర్ వేదికగా `ఛపాక్` సినిమాకి అండగా నిలబడటం ఇప్పుడు బాలీవుడ్ నటులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

 

ఎలాంటి సినిమా ప్రకటన వచ్చినా అందులో కంగననను ఊహించుకుని ఆ పాత్రలో నటించిన వారిపై విమర్శల వర్షం కురిపించే రంగోలి `ఛపాక్` సినిమాపై మాత్రం తన పంథాకు భిన్నంగా స్పందించడం కాస్త ఆశ్చర్యకరమైన విషయమే. అయితే గతంలో రంగోలి చందేల్ యాసిడ్ దాడికి గురైంది. ఆ కారణంగానే ఆమె దీపికలో తనని తాను చూసుకుంటోంది కాబట్టే ఈ సినిమాకి స్వయంగా ప్రచారం చేస్తోందని బాలీవుడ్ జనాలు అభిప్రాయపడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: