టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా టాక్సీవాలా సినిమాని తెరకెక్కించారు యువ దర్శకుడు రాహుల్ సంక్రిత్యన్. ఈ సినిమా రిలీజ్ ముందే మెజారిటీ వీడియో ఆన్ లైన్ లో లీకవ్వడం సంచలనమైంది. ముందై లీకైనా ఆ ప్రభావం లేకుండా థియేటర్లలోనూ టాక్సీవాలా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. టెక్నికల్ గా ఆ సినిమా దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించారన్న ప్రశంసలు దక్కాయి. చాలా లిమిటెడ్ బడ్జెట్ లో తెరకెక్కిన ఈ సినిమా నిర్మాతలకు మంచి లాభాలు తెచ్చిపెట్టింది. అయితే ఈ సినిమా తర్వాత రాహుల్ కు సెకెండ్ సినిమాను చేసే అవకాశం రాలేదు. స్క్రిప్టు లు రెడీ చేసి హీరోల వెంటపడుతున్నా ఎవరు ఒకే చెప్పడం లేదు. అయితే రీసెంట్‌గా రాహుల్ వినిపించిన కథ నేచురల్ స్టార్ కి నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని లేటెస్ట్ న్యూస్.

 

నానికి రాహుల్ స్క్రిప్ట్ నచ్చిందట. అయితే స్క్రీన్ ప్లే లో కొన్ని మార్పులు చేర్పులు చేయమని సూచించాడట. కథనంలో మార్పులతో పాటు రెండు మూడు వెర్షన్లు తీసుకుని మరోసారి కలవమని అన్నారట. దీనినిబట్టి రాహుల్ కి సెకెండ్ ఛాన్స్ ఉందని చెప్పుకుంటున్నారు. ఇక ఫైనల్ స్క్రిప్టు తో మెప్పితే మాత్రం నాని-రాహుల్ కాంబోలో సినిమా స్టార్ట్ అవుతుంది. ప్రస్తుతం నాని ఇంద్రగటి మోహన్ కృష్ణ దర్శకత్వం లో 'వి' సినిమాలో నటిస్తున్నాడు. అలాగే నాని 26వ సినిమాని మజిలి దర్శకుడు శివ నిర్వాణ తో చేస్తున్నాడు. ఆ సినిమా టైటిల్ `టక్ జగదీశ్`. వచ్చే ఏడాది చిత్రీకరణను పూర్తి చేసి రిలీజ్ చేయనున్నారు.

 

అన్నీ సెట్ అయితే ఈ సినిమా తర్వాత రాహుల్ సినిమాకు నాని కాల్షీట్లు కేటాయించే అవకాశం ఉంది. ఇంకా పలువురు యువ దర్శకులకు నాని టచ్ లో ఉన్నట్లు సమాచారం. `అ!` దర్శకుడు ప్రశాంత్ వర్మ తో నాని సినిమా చేసే అవకాశాలు లేకపోలేదు. ప్రశాంత్ ని దర్శకుడి గా పరిచయం చేస్తూ `అ!` సినిమాతో నాని నిర్మాత గా మారిన సంగతి తెలిసిందే. తన బ్యానర్లో డిఫరెంట్ జానర్ సినిమాలు చేయడానికి నాని ఎంతగానో ఆసక్తిని చూపిస్తున్నాడు. రాహుల్ సాంకృత్యయన్ లాంటి యువదర్శకులను ఎంకరేజ్ చేస్తుండడం ఆసక్తికరం.  

మరింత సమాచారం తెలుసుకోండి: