అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ డబ్బు కోసం మోసం చేసినప్పటికీ.. తెలుగు ప్రేక్షకుల మనసులను దోచుకున్నారు... ఇప్పట్లో కూడా అదే తరహాలో జూనియర్ ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ, మెగాస్టార్ చిరంజీవి, మహేష్ బాబు డబ్బు కోసం దగా చేసినప్పటికీ వారి సినిమాలను ఆదరించే ప్రేక్షకులు సంఖ్య పెరిగింది కానీ తగ్గలేదు. ఇంతకీ మన హీరోలు డబ్బు కోసం దగా చేసింది కేవలం సినిమాల్లో మాత్రమే నండి.

ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ యమదొంగ సినిమాలో డబ్బు కోసం ఇతర ప్రజలను మోసం చేస్తూ జీవనం సాగిస్తూ ఉంటాడు. అయితే ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయిన విషయం మనకు తెలిసిందే. నిజానికి డబ్బు కోసం మోసం చేసే పాత్రలో నటించిన హీరోల సినిమాలు బాగానే విజయం సాధించాయి. అవేంటో ఒకసారి చూద్దాం.

బిజినెస్ మాన్ సినిమాలో.. ప్రజలను మోసం చేస్తూ డబ్బు సంపాదించడమే అతని లక్ష్యంగా పెట్టుకుంటాడు మహేష్ బాబు. ఇక పోతే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది. అలాగే ప్రేక్షకుల మనసుల్ని దోచుకుంది

స్వామి రారా చిత్రంలో హీరో పాత్రలో నటించిన హ్యాపీడేస్ ఫేమ్ నిఖిల్ డబ్బు కోసం తెలివిగా దొంగతనాలు చేస్తుంటాడు. చిన్న బడ్జెట్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ సినిమా భారీగా విజయం సాధించింది.

ద్వారకా చిత్రంలో అర్జున్ రెడ్డి ఫేమ్ విజయ్ దేవరకొండ కూడా డబ్బులు కోసం దొంగ బాబా అవతారమెత్తి ప్రజలను మోసం చేస్తాడు.

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన విక్రమార్కుడు సినిమాలో రవి తేజ కూడా డబ్బుల కోసం ప్రజలను మోసం చేస్తాడు. గుండు గీకుతావమ్మా గుండ్లు అనే సీన్ బాగా ఎలివేట్ అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత రవితేజ పోలీస్ అవతారమెత్తినా.. ఈ దొంగ పాత్ర మాత్రం ఈ సినిమాలో కీలకమైంది.

ఈ విధంగా డబ్బులు కోసం మోసం చేసే పాత్రలలో నటించిన మన స్టార్ హీరోలు... ఆయా సినిమాల ద్వారా ప్రేక్షకులను ఫిదా చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: