టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా టాక్సీవాలా సినిమాని తెరకెక్కించారు యువ దర్శకుడు రాహుల్ సంక్రిత్యన్. ఈ సినిమా రిలీజ్ ముందే మెజారిటీ వీడియో ఆన్ లైన్ లో లీకవ్వడం సంచలనమైంది. ముందై లీకైనా ఆ ప్రభావం లేకుండా థియేటర్లలోనూ టాక్సీవాలా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. టెక్నికల్ గా ఆ సినిమా దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించారన్న ప్రశంసలు దక్కాయి. చాలా లిమిటెడ్ బడ్జెట్ లో తెరకెక్కిన ఈ సినిమా నిర్మాతలకు మంచి లాభాలు తెచ్చిపెట్టింది. అయితే ఈ సినిమా తర్వాత రాహుల్ కు సెకెండ్ సినిమాను చేసే అవకాశం రాలేదు. 

 

ఇక టాక్సీవాలా సినిమాను గీతా 2 సంస్థ నిర్మించింది. ఇప్పుడు రాహుల్ తోనే మళ్లీ మరో సినిమా ప్లాన్ చేస్తోంది గీతా 2 సంస్థ. ఈ బ్యానర్ మీద బన్నీవాస్,దర్శకుడు మారుతి,యువి వంశీ భాగస్వాములుగా టాక్సీవాలాను నిర్మించారు. మళ్లీ అదే విధంగా వారు ముగ్గురు తెరవెనుక నిర్మాణ భాగస్వాములుగా వుంటూ అదే డైరక్టర్ తో,అదే టీమ్ తో సినిమా ప్లాన్ చేస్తున్నారు. టైమ్ మెషీన్ కాన్సెప్ట్ తో తయారుచేసిన కథను ఓకె చేసారు.గీతా స్టయిల్ మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. కానీ ఏ హీరో రెడీగా వున్నారు అన్నది ఇప్పుడు తేఅల్సి ఉంది. నాని బ్యాక్ టు బ్యాక్ రెండు మూడు సినిమాలు ఫిక్స్ చేసుకుని వున్నారు.వాటిల్లో రాహుల్ సినిమా కూడా వుంది. 

 

సాయి ధరమ్ తేజ్ మరో రెండు మూడు ప్రాజెక్టులు చేయాల్సి వుంది. అయితే ఈ కథకి వరుణ్ తేజ్ సూట్ సెట్ కాకపోవచ్చునని అంటున్నారు. శర్వానంద్ యువిలో ఓ సినిమా చేయబోతున్నారు. శిరీష్ ను పెట్టి చేసే ధైర్యం చేయకపోవచ్చునని అంటున్నారు. ఇక మిగిలింది రామ్ ఒక్కడే అని వినిపిస్తోంది. ప్రస్తుతం రామ్ చేస్తున్న సినిమా తరువాత ఆ సినిమా మీదకు రామ్ వచ్చే అవకాశం వుందని తెలుస్తోంది. రామ్ హీరోగా గీతా ఆర్ట్స్ లో ఒక సినిమా వుండాలని రామ్ పెదనాన్న స్రవంతి రవికిషోర్ కి ఎప్పటి నుంచో కోరిక ఉందట. అందుకే బహుశా ఈ కాంబినేషన్ సెట్ కావచ్చు అని తాజా సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: