అసలు బాలయ్య-బోయపాటి కాంబోలో సినిమా మొదలవనేలేదు అప్పుడే రకరకాల గాసిప్స్ తో వైరల్ అవుతున్నాయి. ఇలా సినిమా మీద వస్తున్న గ్యాసిప్ లు దర్శకుడు బోయపాటిని ఫీలయ్యేలా చేస్తున్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం వున్న హిందీ మార్కెట్ పరిస్థితి.. బాలయ్య గత సినిమాల మార్కెట్, బోయపాటి సినిమాల మార్కెట్..ఇలా ఇవన్నీ చూసుకుంటే ఈ సినిమాకు ఎంత బడ్జెట్ పెడితే ప్రాఫిట బుల్ అనే విషయం మీద విపరీతంగా వార్తలు వస్తున్నాయి.

 

బోయపాటి ఈ సినిమాకు 70 కోట్ల బడ్జెట్ అంటున్నారని..కానీ బాలయ్యతో గట్టిగా యాభై కోట్లు లాగడం కష్టం అవతుందన్నది ఈ వార్తల సారాశం. కానీ బోయపాటి వినయ విధేయ రామ డిజాస్టర్ అయినా 60 కోట్లకు పైగా వసూలు చేసిందన్న ధీమాతో బోయపాటి ఉన్నాడట. కానీ బాలయ్యసినిమా కూడా ఆ రేంజ్ లో లేవు అని బోయపాటి గుర్తించడం లేదేమో? 

 

ఇలా వార్తలు వస్తూ వుంటే నిర్మాత ఎక్కడ వెనకడుగు వేస్తారేమో అని బోయపాటి టెన్షన్ పడుతున్నారని తెలుస్తోంది. జయజానకీ నాయకతో నిర్మాత మిరియాల రవీందర్ రెడ్డి గట్టి దెబ్బ తిన్నారు. ఆ సినిమా దర్శకుడు కూడా బోయపాటే. అయితే ఈ సినిమా వ్యవహారం వేరు. బాలయ్యతో 70 కోట్లకు పైగా ఖర్చు అంటే చాలా కష్టంఅవుతుంది. ఎందుకంటే బాలయ్యకు ఓవర్ సీస్ మార్కెట్ లేదన్న విషయం తెలిసిందే. హిందీ మార్కెట్ డౌన్ లో వుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో బాలయ్య-బోయపాటి మీద థియేటర్ల నుంచి 40 కోట్లు రాబట్టాలన్నా చాలా కష్టమే అని ట్రేడ్ వర్గాల మాట. ఇవన్నీ వార్తలు వస్తుంటే బోయపాటి బాగా టెన్షన్ పడుతూ త్వరగా సినిమా స్టార్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారట. ఇక బాలయ్య కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రూలర్ సినిమా పోస్టర్స్, టీజర్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. త్వరలో ఈ సినిమా రిలీజవడానికి సిద్దమవుతోంది. 


  

మరింత సమాచారం తెలుసుకోండి: