టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మొదట తన తండ్రి నటశేఖర సూపర్ స్టార్ కృష్ణ గారి నటవారసత్వంతో నీడ అనే సినిమాతో టాలీవుడ్ కి బాలనటుడిగా రంగప్రవేశం చేసారు. ఆ తరువాత పోరాటం, ముగ్గురు కొడుకులు, బజారు రౌడీ, కొడుకు దిద్దిన కాపురం, బాలచంద్రుడు వంటి సినిమాల్లో బాలనటుడిగా నటించి ఆ వయసులోనే ప్రేక్షకుల అభిమానం పొందారు. ఇక ఆ తరువాత కొంత గ్యాప్ తీసుకున్న మహేష్, 1999లో వచ్చిన రాజకుమారుడు సినిమాతో హీరో గా ఎంటర్ అవడం జరిగింది. హీరోగా నటించిన తొలిసినిమాతోనే సూపర్ డూపర్ హిట్ కొట్టిన మహేష్, అక్కడి నుండి తన ఆకట్టుకునే నటనతో ఒక్కొక్కటిగా అవకాశాలు అందిపుచ్చుకుని నేడు టాలీవుడ్ నెంబర్ వన్ హీరోల్లో ఒకరిగా ఎదిగారు.

 

అయితే మహేష్ బాబు రాజకుమారుడు సినిమా కంటే ముందే, దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి ఆయనతో అప్పట్లో యమలీల సినిమాను తీయాలని భావించి, ఆ విషయమై సూపర్ స్టార్ కృష్ణ గారిని కలిసి మాట్లాడడం జరిగిందట. అయితే, మీరు చెప్పిన కథ చాలా బాగుంది, కాకపోతే మహేష్ బాబు హీరోగా నటించడానికి ఇంకొంత సమయం పడుతుందని, 

 

కావున తాను ఆ సినిమా చేయలేడని సున్నితంగా ఆ అఫర్ ని తిరస్కరించారట. అయితే ఒకవేళ ఆ సినిమా కనుక చేసుంటే మహేష్ బాబు కెరీర్ వేరేలా ఉండేదేమో అంటున్నారు సూపర్ స్టార్ ఫ్యాన్స్. నిజానికి యమలీల సినిమాలో అప్పట్లో హీరోగా నటించిన ఆలీకి ఆ సినిమా ద్వారా హిట్ లభించడంతో పాటు అక్కడి నుండి వరుసగా మంచి అవకాశాలు దక్కాయి. ఆ విధంగా సూపర్ స్టార్ కనుక యమలీల చేసుంటే, మంచి అవకాశాలతో దూసుకుపోవడంతో పాటు, కెరీర్ పరంగా పవన్ కళ్యాణ్ కంటే కూడా సీనియర్ హీరోగా మారి ఉండేవారు. కొన్నేళ్ల క్రితం జరిగిన ఆ ఘటనను ప్రస్తుతం మహేష్ ఫ్యాన్స్ సరదాగా గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియా మాధ్యమాల్లో కామెంట్స్ చేస్తున్నారు......!!   

మరింత సమాచారం తెలుసుకోండి: