తెలుగు సినిమా పరిశ్రమలో సెంటిమెంట్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. నిర్మాత, దర్శకులు, హీరోలు సెంటిమెంట్ ను బలంగా నమ్ముతారు. ఇప్పుడీ సెంటిమెంట్ రాజమౌళి సినిమా ఆర్ఆర్ఆర్ విషయంలో కనిపిస్తోంది. కావాలని చేయకపోయినా, దురదృష్టవశాత్తు జరిగినా ఆర్ఆర్ఆర్ సినిమా విషయంలో ఓ దురదృష్టకర సంఘటన జరిగింది. నిన్న అరకులో షూటింగ్ జరుపుకుంటున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ నటిస్తున్న సన్నివేశం లీక్ అయింది. ఇప్పటివరకూ గుట్టుచప్పుడు కాకుండా జరిగిన షూటింగ్ ఒక ఊళ్ళో జరిగేసరికి ఓ సీన్ లీక్ అయిపోయింది.

 

 

ఇలా విడుదలకు ముందే సినిమా, వీడియో క్లిప్స్, ఫొటోస్, స్టిల్స్.. లీక్ కావడం కొత్తేమీ కాదు. కానీ.. నిర్మాతకు తీరని నష్టం. అయితే.. ఇలా లీక్ అయిన తెలుగు సినిమాలు చూసుకుంటే చాలానే ఉన్నాయి. వాటిలో దాదాపు హిట్లు, సూపర్ హిట్లు అయ్యాయి. ఇప్పుడిదే ఆర్ఆర్ఆర్ విషయంలో సెంటిమెంట్ గా మారిందా అనే వాఖ్యలు వస్తున్నాయి. నిజానికి రాజమౌళి సినిమాలు.. బాహుబలి సిరీస్ సినిమాలు ముందే లీక్ అయి నిర్మాతలను, రాజమౌళిని కంగారు పెట్టాయి. పవన్ కల్యాణ్ అత్తారింటికి దారేది సగం సినిమా ఎడిటింగ్ రూమ్ నుంచి బయటకొచ్చేసింది. ఇంకా కొన్ని సినిమాలు ఇలానే లీక్ అయ్యాయి. కానీ రిలీజ్ అయ్యాక సంచలనాలు నమోదు చేశాయి.

 

 

సినిమా మొదలైన నాటి నుంచీ ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తి పెరిగిపోతూనే ఉంది. అంచనాలకు తగ్గట్టు సినిమా తీయడంలో రాజమౌళి సిద్ధహస్తుడు. భారీ క్యాస్టింగ్ కూడా సినిమాపై అంచనాలను ఆకాశాన్ని తాకేలా చేస్తోంది. హిందీ, తమిళం నుంచే కాకుండా ఇంగ్లీష్ నటులు కూడా  ఈ సినిమాలో నటిస్తున్నారు. చరణ్ లుక్ బయట కనపడితే.. ఎన్టీఆర్ ఏకంగా ఆ పాత్రలోనే కనిపించేశాడు. సినిమాలో సీన్ లీక్ కావడం దూరదృష్టమే అయినా సెంటిమెంట్ ప్రకారం సినిమా బ్లాక్ బస్టర్ ఖాయమే అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: