వరుసగా రెండు ఫ్లాప్ సినిమాలు తర్వాత నందమూరి బాలకృష్ణ కె.ఎస్.రవికుమార్ దర్శకత్వం లో ‘రూలర్’ అనే సినిమా చేసిన విషయం మనకందరికీ తెలిసినదే. తాజాగా ఈ సినిమాకి సంబంధించి విడుదలైన టీజర్ నందమూరి ఫ్యాన్స్ ను కొంత నిరుత్సాహం పెట్టడం జరిగింది. ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలు ఫ్లాప్ అయిన తర్వాత  కచ్చితంగా విజయం సాధించాలని రూలర్ సినిమా పై బాలయ్య అభిమానులు చాలా అంచనాలు పెట్టుకున్నారు. అయితే 'రూలర్' టీజర్ చూసి సినిమా ఎలా ఉంటుందో అన్న భయంతో బాలయ్య బాబు అభిమానులు ఉన్నట్లు సమాచారం. అంతేకాకుండా డిసెంబర్ 20వ తారీకు న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ అంతంత మాత్రంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. రూలర్ మూవీ ప్రీరిలీజ్ బిజినెస్ రూ 15 కోట్ల లోటుతో ఉన్నట్లు తెలుస్తోంది.

 

ఇటువంటి తరుణంలో బాలకృష్ణతో బోయపాటి రిస్క్ చేయడానికి నెక్స్ట్ చేయబోయే సినిమా కోసం భారీ బడ్జెట్ ఖర్చు పెట్టడానికి బోయపాటి ప్లాన్ చేసినట్లు ఫిల్మ్ నగర్ లో వార్తలు వినబడుతున్నాయి. దాదాపు 70 కోట్లకుపైగా బడ్జెట్టు బాలయ్యతో చేయబోయే 3 సినిమా తీయాలనే ఆలోచనలో ప్రస్తుతం బోయపాటి వున్నట్లు సమాచారం. దీంతో ఫిలిం ఇండస్ట్రీలో బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన చివరి సినిమా వినయ విధేయ రామ దారుణంగా ఫ్లాప్ అయినా ఈ సందర్భంలో బాలయ్య తో చేయబోయే సినిమా కోసం అన్ని కోట్లు పెట్టి సినిమా తీయడం అంటే రిస్కుతో కూడిన పని అని ఇండస్ట్రీలో ఉన్న వాళ్లు ఈ వార్తపై కామెంట్లు చేస్తున్నట్లు సమాచారం.

 

మరోపక్క బాలయ్యకి సింహా లెజెండ్ లాంటి రెండు సూపర్ డూపర్ హిట్లు ఇవ్వడంతో తాజాగా తీయబోతున్న సినిమా స్టోరీ ఆ రెండిటికీ మించి ఉండబోతున్న ట్లు… సినిమా స్టోరీ పై పక్కా కాన్ఫిడెంట్ తోనే బోయపాటి ఇంత భారీ బడ్జెట్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్లు కచ్చితంగా ఇది హ్యాట్రిక్ కొట్టే స్టోరీ అని బలంగా నమ్ముతున్నట్లు ఇందువలన ఈ సినిమా కోసం భారీగా ఖర్చు చేయాలని బోయపాటి ఆలోచిస్తున్నట్లు మరోపక్క వార్తలు వినబడుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: