త్రివిక్రమ్ దర్శకత్వంలో తాజాగా అల్లు అర్జున్ నటించిన 'అల వైకుంఠ పురంబులో' సినిమా టీజర్ ఇటీవల విడుదల అవ్వడం జరిగింది. దీంతో టీజర్ చూసిన ప్రతి మెగా ప్రేక్షకుడు కచ్చితంగా 'అలా వైకుంఠపురం లో' సినిమా మెగాస్టార్ చిరంజీవి నటించిన 'రౌడీ అల్లుడు' సినిమా మాదిరిగానే ఉందని అటువంటి చాయే కనపడుతున్నాయని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. 'రౌడీ అల్లుడు' సినిమాలో చిరంజీవి డబల్ పాత్రలో నటించడం జరిగింది. అమాయకంగా నటించే చిరంజీవి పాత్ర ఒకటి ఉంటే మరొకటి ఆటో జానీ గా చిరంజీవి నటించే పాత్ర ఉంటుంది. అయితే సినిమాలో అమాయకంగా నటించే చిరంజీవిని కాపాడటం కోసం ఆటో జానీ పాత్ర 'రౌడీ అల్లుడు' సినిమాకే హైలెట్.

 

ఇప్పుడు కూడా అదే తరహాలో 'అలా వైకుంఠపురం లో' సినిమాలో అమాయక పాత్రలో అక్కినేని సుశాంత్ నటిస్తున్నట్లు దీంతో అక్కినేని సుశాంత్ ని కాపాడటం కోసం అల్లుఅర్జున్ అతను పనిచేసే చోట బాస్ క్యారెక్టర్ లో వచ్చినట్లు టీజర్ బట్టి చూస్తే అర్థమవుతుందని ఇది చిరంజీవి క్యారెక్టర్ 'రౌడీ అల్లుడు' సినిమాలో ఆటో జానీ పాత్రని పోలిన విధంగా ఉందని అల్లు అర్జున్ కూడా అదే తరహాలో నటించినట్లు సినిమా టీజర్ బట్టి అర్థమవుతోందని కామెంట్ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్.

 

మరోపక్క సినిమా అదే విధంగా ఉంటే మాత్రం త్రివిక్రమ్ పై కాపీ క్యాట్ అనే మరక మళ్లీ పడటం గ్యారెంటీ అనే టాక్ తాజాగా విడుదలైన టీజర్ బట్టి సోషల్ మీడియా లో నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు. మరోపక్క సినిమా టీజర్ కి సోషల్ మీడియా లో అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. పాటలు ఏవిధంగా రికార్డుల మీద రికార్డులు సృష్టించడం జరిగిందో అదే స్థాయిలో టీజర్ కూడా యూట్యూబ్ ఛానల్ లో అతి తక్కువ టైమ్ లోనే రికార్డుల మీద రికార్డులు సృష్టించింది. ప్రస్తుతం ట్రెండ్ అవుతూ ఇంకా దూసుకుపోతుంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: