తెలుగు ఇండస్ట్రీలో జబర్దస్త్ కామెడీ షో గురించి తెలియని వాళ్లుండరేమో..? ఇంకా చెప్పాలంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్లంతా కలిసి ఈ కామెడీ షోను ఈ స్థాయిలో నిలబెట్టారు. అలాగే తెలుగు టెలివిజన్ చరిత్రలో కొత్త రికార్డు సృష్టించిన కార్యక్రమం ఏదైనా ఉందంటే అది ఈటీవీ 'జబర్దస్త్' మాత్రమే అనడం లో అతిశయోక్తి లేదు. మ‌రియు జబర్ధస్త్ షో చూసే వాళ్లలో ఎక్కువ మంది జబర్ధస్త్ కమెడియన్స్ చేసే స్కిట్స్‌కు నాగబాబు నవ్వే నవ్వుల కోసమే చూసే వాళ్లు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. వాస్త‌వానికి జబర్దస్త్ టీఆర్ఫీ రేటింగ్ ల పరంగా సృష్టించిన సంచలనం ఒక ఎత్తైతే, ఆ కార్యక్రమం ద్వారా వెలుగులోకి వచ్చిన ఎందరో కళాకారులకు బంగారు భవిష్యత్ ఇచ్చిన ప్లాటుఫామ్ గా నిలబడిన వైనం మరో ఎత్తు.

 

ఇక ఈ మధ్యే మెగా బ్రదర్ నాగాబాబు షో నుంచి తప్పుకున్నాడు.అయితే తాజాగా జీ తెలుగులో తన ప్రస్థానం ప్రారంభించిన నాగబాబు, తన సత్తా ఏంటో నిరూపించుకునేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఇప్పటికే లోకల్ గ్యాంగ్స్ ప్రోగ్రాం ద్వారా ఎంట్రీ ఇచ్చిన నాగబాబు మరో ప్రోగ్రాంలో సైతం చీఫ్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. అయితే నాగ‌బాబు త‌ప్పుకోవ‌డంతో ఆయన స్థానంలో ఎవరొస్తారని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  అయితే ఫైనల్‌గా నాగబాబు కుర్చీలోకి కమెడియన్ అలీ వచ్చి కూర్చున్నారు. దీంతో నాగబాబు రేంజ్ సీనియారిటీ ఉన్న అలీనే జబర్ధస్త్‌కు పర్మినెంట్ జడ్జి అని అంతా భావించారు. 

 

అయితే తాజాగా ఈ విషయంలో జబర్ధస్త్ టీం మరో నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. నాగ‌బాబు రేంజ్‌లో అలీ ఈ షోను ముందుకు తీసుకెళ్లడంలో అంతగా సక్సెస్ సాధించలేకపోతున్నారనే భావన వ్యక్తమవుతోంది. దీనిపై కొంతమంది నుంచి జబర్ధస్త్ నిర్వాహకులు ఫీడ్ బ్యాక్ కూడా తీసుకున్నారని.. అలీని జబర్ధస్త్‌లో కొనసాగించే విషయంలో వారు పునరాలోచనలో పడ్డారనే టాక్ వినిపిస్తోంది. అయితే నాగబాబు స్థానంలో మరో సెలబ్రిటీ జడ్జి దొరికేవరకు జబర్ధస్త్‌లో అలీ కంటిన్యూ అయ్యే అవకాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: