సినీ ఇండస్ట్రీలో నెలలో చాలా సినిమాలు రిలీజ్ అవుతుంటాయి.. వాటిలో కొన్ని సినిమాలు రిలీజ్ అయిన మొదటి రోజునే గుడ్ బై చెబితే, మరి కొన్ని సినిమాలు మాత్రం ఓ మాదిరిగా అడి పర్వాలేదని పించాయి.. ఇకపోతే ఈ ఏడాదికి గాను సినిమాల సంఖ్య ఎక్కువగా ఉన్నా కూడా బాక్సాఫీస్ ను షేక్ చేసిన సినిమాలు కేవలం ఒకటో రెండో ఉన్నాయి.. వాటిలో తెలుగు చిత్రంగా ఎఫ్ 2 సినిమా సంక్రాంతికి రిలీజ్ అయ్యి భారీ కలెకషన్లతో పాటుగా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. 

ఇకపోతే గత సినిమా డిజాస్టర్ గా మారినప్పుడు మరో సినిమా తీయడానికి కాస్త టైమ్ తీసుకొని మరి సినిమాలతో పలకరి స్తున్నారు.  ఈ విధంగా చూసుకుంటే 2019 సంవత్సరానికి ఒక్క సినిమా కూడా రాని హీరోల జాబితాలో ప్రముఖంగా వినిపించే పేర్లు చూద్దాం..

అల్లుఅర్జున్:


నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా భారీ డిజాస్టర్ గా మిగలడం కారణంగా బన్నీ మరో సినిమా చేయడానికి చాలా సమయం తీసుకొని ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వం లో అల వైకుంఠపురములో సినిమాలో నటిస్తున్నారు.. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదల కానుంది..

రవితేజ:

మాస్ మహారాజ రవితేజ ఈ మధ్య ఒక్క హిట్ సినిమా కూడా లేక చూస్తున్నారు.. ప్రస్తుతం డిస్కో రాజా సినిమా చేస్తున్నారు..భారీ బడ్జెట్ తో భారీ కథనంతో ఈ సినిమా తెరకెక్కుతోంది..ఈ సినిమా అయినా కూడా హిట్ ఇస్తుందో లేదో చూడాలి..


నితిన్:

ఆఆ సినిమా తర్వాత నితిన్ ఖాతాలో ఒక్క సినిమా కూడా హిట్ గా నిలవలేదు. వరుస అపజయాల కారణంగా 2019లో బిగ్ స్క్రీన్ మిస్ చేసుకున్నాడు. మంచి సక్సెస్ అందుకోవ...

రానా:

రానా పరిస్తితి కూడా అంతే సినిమాల సంఖ్య తక్కువే హిట్ సినిమాలు తక్కువే. ఒక్క బాహుబలి సినిమాతో హిట్ అందుకున్న రానా రెండు సినిమాల్లో నటించినా కూడా ప్రయోజనం లేదు..ఇప్పుడు విరాటపర్వం సినిమాలో నటిస్తున్నారు..


ఇలా పవన్ కల్యాణ్,అల్లరి నరేష్,మంచు మనోజ్ లాంటి హీరో లు కూడా ఈ ఏడాదికి హిట్ ఖాతాను ఓపెన్ చేయలేదు..2020లో అన్న వరుస సినిమాలు చేస్తారేమో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: