స్టైలీష్‌స్టార్ అల్లు అర్జున్ న‌టిస్తోన్న అల వైకుంఠపురములో సినిమా నుంచి బుధ‌వారం టీజర్ ను రిలీజ్ చేశారు. ప్రధాన పాత్రధారులందరినీ కవర్ చేస్తూ కట్ చేసిన ఈ టీజర్, సినిమాపై ఆసక్తిని పెంచేదిలా వుంది. బ‌న్నీ చెప్పిన పంచ్‌లు, డైలాగులు, యాక్ష‌న్ క‌ట్స్‌, ట‌బు డ్యాన్స్ మూమెంట్స్, థ‌మ‌న్ ఆర్ ఆర్ అన్ని సినిమాపై అంచ‌నాలు పెంచేశాయి. సినిమా కంప్లీట్ ఫ్యామిలీ ప్యాకేజ్ అని అంటున్నారు.

 

ఇక టీజ‌ర్ అలా రిలీజ్ అయ్యిందో లేదో యూ ట్యూబ్‌లో దూసుకుపోతోంది. టీజర్ ను విడుదల చేసిన 7 నిమిషాల్లోనే 1 మిలియన్ వ్యూస్ ను రాబట్టింది. అత్యంత వేగంగా ఈ స్థాయి వ్యూస్ ను సాధించిన టీజర్ గా నిలిచింది. ఇటీవల సరిలేరు నీకెవ్వరు నుంచి టీజర్ ను రిలీజ్ చేయగా 9 నిమిషాల్లో 1 మిలియన్ వ్యూస్ మార్కును అందుకుంది. అదే పెద్ద రికార్డు అని అంద‌రూ అనుకున్నారు.

 

ఇక ఇప్పుడు ఆ సినిమా క్రేజ్ బీట్ చేసేలా వైకుంఠ‌పురం యూ ట్యూబ్ ను షేక్ చేసి ప‌డేసింది. స‌రిలేరు నీకెవ్వ‌రు సినిమా టీజ‌ర్ ను మించేలా... అంతకంటే వేగంగా 1 మిలియన్ వ్యూస్ ను రాబట్టి అల వైకుంఠపురములో టీజర్ కొత్త రికార్డును నమోదు చేసింది. ఈ మూవీని త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో అల్లు అర్జున్..పూజాహెగ్డే జంటగా నటిస్తున్నారు.

 

హారిక & హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్ - గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై అల్లు అర‌వింద్ - చిన‌బాబు సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాకు థ‌మ‌న్ స్వ‌రాలు అందిస్తున్నారు. ఇప్ప‌టికే త్రివిక్ర‌మ్ - బ‌న్నీ కాంబోలో జులాయి, స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి సినిమాలు వ‌చ్చి సూప‌ర్ హిట్ అయ్యాయి. ఈ సినిమాతో కూడా హిట్ కొట్టి వీరిద్ద‌రు హ్యాట్రిక్ కొట్టాల‌ని చూస్తున్నారు. మరి ఈ కాంబినేష‌న్ ఎంత వ‌ర‌కు స‌క్సెస్ అవుతుందో ?  జ‌న‌వ‌రి 12న తేలిపోనుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: