సందీప్ రెడ్డి వంగా...ఇప్పుడు ఈ దర్శకుడి గురించి అటు టాలీవుడ్ లోనూ, ఇటు బాలీవుడ్ లోనూ తెలియని వాళ్ళు లేరు. అర్జున్ రెడ్డి సినిమాతో అతడు చేసిన మ్యాజిక్ అంతా ఇంతా కాదు. చిన్న సినిమాగా విడుదల అయిన ఈ చిత్రం అఖండ విజయం సాధించింది. విజయం సాధించడమే కాదు. సినీ ప్రేక్షకుల నుండి సామాన్య ప్రేక్షకుల వరకు మాట్లాడుకునేలా చేసిన చిత్రమిది. సందీప్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ హీరోగా నటించాడు.

 

అయితే ఈ చిత్రం బాలీవుడ్ లో కబీర్ సింగ్ అనే పేరుతో షాహిద్ కపూర్ హీరోగా తెరకెక్కింది. ఈ బాలీవుడ్ రీమేక్ ని కూడా దర్శకత్వం వహించింది సందీప్ వంగానే. తెలుగులో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ చిత్రం బాలీవుడ్ లో కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సుమారు మూడు వందల కోట్లకి పైగా వసూళ్ళు సాధించి షాహిద్ కపూర్ కెరీర్లోనే అత్యధిక వసూళ్ళు సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ సినిమా గురించి బాలీవుడ్ లో విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. అదలా ఉంచితే ఈ చిత్రం మరో మైలురాయిని చేరుకుంది. 

 

 

గూగుల్ ఇండియా ఈ ఏడాదికి గాను ప్రేక్షకులు ఎక్కువగా సెర్చ్ చేసిన సినిమాల జాబితా విడుదల చేసింది. ఈ ఏడాది అధికంగా ప్రేక్షకులు గూగుల్ లో సెర్చ్ చేసిన జాబితాలో కబీర్ సింగ్ మెదటి స్థానములో నిలిచింది. ఆ తరువాత హాలీవుడ్ మూవీస్ ‘అవెంజర్స్: ఎండ్ గేమ్’, ‘జోకర్’, ‘కెప్టెన్ మార్వెల్’ రెండు, మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. ఇక, ‘సూపర్ 30, ‘మిషన్ మంగళ్’, ‘గల్లీ బాయ్’, ‘వార్’, ‘హౌస్‌ఫుల్ 4′, ‘ఉరి’ వరుసగా మిగిలిన స్థానాలను దక్కించుకున్నాయి. అయితే ఈ  లిస్ట్ లో సాహో లేకపోవడం ఆశ్చర్యకరం.

మరింత సమాచారం తెలుసుకోండి: