సంక్రాంతి వార్ కు సంబంధించి విడుదల అవుతున్న ‘సరిలేరు నీకెవ్వరు’ ‘అల వైకుంఠపురములో’ మూవీల ప్రమోషన్ కు కోట్ల రూపాయలలో ఖర్చులు పెడుతూ భారీ వ్యూహాలు అనుసరిస్తున్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రత్యేకంగా ముంబాయి నుండి పిఆర్ టీమ్ లు వచ్చి ఈ రెండు సినిమాల ప్రమోషన్ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు అంటే ఈ మూవీల ప్రమోషన్ ఏ రేంజ్ లో జరుగుతోందో అర్ధం అవుతుంది. 

ఈ రగడ మధ్య ఇప్పుడు విజయ్ దేవరకొండ వచ్చి చేరడం చాలమందిని ఆశ్చర్య పరుస్తోంది. వాస్తవానికి విజయ్ దేవరకొండ నటిస్తున్న ‘వరల్డ్ ఫేమస్ లవర్’ రాబోతున్న సంక్రాంతి రేసులో లేదు. ఈ మూవీని ఫిబ్రవరి 14న వేలెంటైన్స్ డే సందర్భంగా విడుదల చేయబోతున్నారు. 

అయితే ఈ మూవీ విడుదలకు ఇంకా చాల సమయం ఉన్నా ఈ మూవీ ప్రమోషన్ ను ఈరోజు నుంచి మొదలు పెట్టడం అత్యంత ఆశ్చర్యంగా మారింది. ఈరోజు సాయంత్రం ఈ మూవీలో నటిస్తున్న నలుగురు హీరోయిన్స్ లో మొదటిగా ఐశ్వర్యా రాజేష్ లుక్ ను ఆ తరువాత రోజులలో వరసగా ఇజ్ బెల్లి కేథరిన్ ఆ తరువాత రాశి ఖన్నాల ఫస్ట్ లుక్స్ ను ఈరోజు నుండి 15వ తారీఖు వరకు వరసగా ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు విడుదల చేయబోతున్నారు.

క్రాంతి మాధవ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో విజయ్ దేవరకొండ లుక్స్ కొంత వరకు ‘అర్జున్ రెడ్డి’ ఛాయలలో కనిపిస్తూ ఉండటంతో తిరిగి తన అభిమానులకు మరో ‘అర్జున్ రెడ్డి’ ని ఈ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ ద్వారా చూపించబోతున్నాడా అన్న సందేహాలు ఇప్పటికే కొంతమందికి కలుగుతున్నాయి. ‘డియర్ కామ్రేడ్’ పరాజయం తరువాత విడుదల కాబోతున్న మూవీ కాబట్టి విజయ్ ముందు చూపుతో తన సినిమాకు ఇప్పటి నుంచే ప్రమోషన్ మొదలు పెట్టాడు అన్న అభిప్రాయం ఉన్నా బన్నీ మహేష్ ల సినిమాల పబ్లిసిటీ సందడిలో ‘వరల్డ్ ఫేమస్ లవర్’ మరుగున పడిపోతుందా అంటూ మరికొందరు సందేహాలు వ్యక్త పరుస్తున్నారు.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: