టాలీవుడ్లో సంచలన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రాంగోపాల్ వర్మ ఇటీవల కాలంలో వరుసగా కాంట్రవర్సీ మూవీస్ తెరకెక్కిస్తూ ఎన్నో ఎన్నో సంచలనాలు సృష్టించారు.  అయితే రాంగోపాల్ వర్మ మొదట్లో కామెడీ, హర్రర్, మాఫియా నేపథ్యంలో సినిమాలు తెరకెక్కించారు.  కానీ ఈ మద్య బయోపిక్ సినిమాలు, రాజకీయ నేపథ్యంలో ఉన్న సినిమాలు తెరకెక్కిస్తున్నారు.  ఆ మద్య ఏపి ఎన్నికల సమయంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ తెరకెక్కించారు.  దాంతో ఏపిలో పెను సంచలనాలు పుట్టుకొచ్చాయి.  ఒక రకంగా చెప్పాలంటే టీడీపీ నేతలు ఈ మూవీ రిజీల్ ఆపడానికి ఎన్నో కష్టాలు పడ్డారు.  మొత్తానికి ఈ మూవీ ఎన్నికలు పూర్తయ్యే వరకు రిలీజ్ కాలేదు.  

 

ఆ తర్వాత రీలీజ్ అయ్యింది..కాకపోతే అప్పటికే ఏపిలో కాకుండా ఇతర రాష్ట్రాల్లో రిలీజ్ అయ్యింది. తాజాగా ఇప్పుడు ఏపిలో ప్రస్తుతం రాజకీయ పరిస్థితులకు అద్దం పట్టేలా ‘అమ్మరాజ్యంలో కడప బిడ్డలు’ అనే మూవీ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు  U/A సర్టిఫికెట్ ఇచ్చింది. అయితే ఈ మూవీలో తమ క్యారెక్టర్స్ వ్యంగంగా చూపించారని.. తప్పకుంగా చూపించారని టైటిల్ పై వివాదం.. వర్మపై కేసు ఒక్కటి కాదు ఎన్నో రకాల అభ్యంతరాలు వచ్చాయి. తాజాగా ప్రస్తుతం చైనాలో ‘ఎంటర్‌ ది గాళ్‌ డ్రాగన్‌’ సినిమా చిత్రీకరణలో బిజీగా వున్న వర్మ నిన్న రాత్రి వీడియో కాల్‌ ద్వారా హైదరాబాద్‌లోని మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

 

నా  సినిమాను ఆపేందుకు ప్రయత్నించిన వారిపై త్వరలోనే కేసులు పెట్టబోతున్నట్టు పేర్కొన్నారు. ఫైనల్‌గా తన సినిమా రిలీజ్ అవుతోందని అన్నారు. తన సినిమాను అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారి పేర్లను త్వరలో బయటపెడతానని అన్నారు. ఇక వర్మ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో చిత్ర సమర్పకుడు టి.అంజయ్య మాట్లాడుతూ.. తమ సినిమాలో ఏ ఒక్క కులాన్నీ, మతాన్నీ కించపరచలేదని స్పష్టం చేశారు.  ట్రైలర్ చూసినంత మాత్రాన సినిమా గురించి మొత్తం సినిమా చూసినట్లు కాదని.. సినిమా చూసిన తర్వాత అభిప్రాయాలు మారుతాయని చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: