సూపర్ స్టార్ రజనీ కాంత్ స్పీడ్ చూసి కోలీవుడ్ లో స్టార్ హీరోలందరికి దిమ్మ తిరిగిపోతోంది. ఇప్పటికి ఆయనకున్న స్టామినా కోలీవుడ్ లో మరే హీరోకి లేకపోవడం ఆసక్తికరం. ముఖ్యంగా రజనీ కున్న ఫ్యాన్ ఫాలోయింగ్ టోటల్ సౌత్ ఇండస్ట్రీలో ఇక ఏ హీరోకి లేదన్న విషయం అదరికి తెలిసిందే. రజని నుండి ఒక సినిమా వస్తుందంటే ఫ్యాన్స్ రెండు నెలలు ముందు నుంచే సంబరాలు మొదలు పెడతారు. ఇక ఆయన గత చిత్రాలు వరుసగా ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే. అంతేకాదు కాదు తెలుగులో ఆ మూడు సినిమాల ప్రభావం గట్టిగానే పడింది. కబాలి, కాలా, పేట, రోబో 2.ఓ..ఇలా వరుసగా ఫ్లాప్ అయ్యాయి. వీటిలో కాస్త 2.ఓ బెటరని చెప్పాలి. అయినా రజనీ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అంతే కాదు ఆయన స్పీడ్ కూడా డబుల్ అవుతోంది. 

 

ఇక రీసెంట్‌గా దర్బార్ సినిమాను ఇలా పూర్తిచేసిన రజనీకాంత్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా అలా మరో సినిమా స్టార్ట్ చేశారు. ఈరోజు రజనీకాంత్ కొత్త సినిమా ఘనంగా ప్రారంభమైంది. సన్ పిక్చర్స్ బ్యానర్ పై శివ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాకు ఈరోజు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. జనవరి మూడో వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు కాబోతోంది. మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన దర్శకుడు శివ. మొన్నటివరకు బ్యాక్ టు బ్యాక్ అజిత్ తో సినిమాలు చేసిన ఈ దర్శకుడు, ఇప్పుడు రజనీకాంత్ ను మరింత మాస్ గా చూపించడానికి రెడీ అవుతున్నాడు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో నడిచే కథతో ఈ సినిమా తెరకెక్కనుంది. కెరీర్ లో రజనీకాంత్ కు ఇది 168వ సినిమా.

 

ఈ సినిమాలో రజనీకాంత్ సరసన కీర్తిసురేష్ హీరోయిన్ గా నటించనుంది. ఖుష్బూ, మీనా, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషించబోతున్నారు. గతంలో రజనీకాంత్ సరసన హీరోయిన్లుగా నటించారు ఖుష్బూ, మీనా. ఇప్పుడు ఆయన సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నారు. ఈ న్యూస్ అటు కోలీవుడ్ తో పాటు ఇటు టాలీవుడ్ లో ఆసక్తికరంగా మారింది. అంతేకాదు ఈ రోజు సూపర్ స్టార్ బర్త్ డే కావడంతో రజనీ కొత్త సినిమాని అనౌన్స్ చేసి ఫ్యాన్స్ కి అదిరిపోయో గిఫ్ట్ ఇచ్చారు. ఇక ఈ సినిమా అనౌన్స్ కాగానే రజనీ ఫ్యాన్స్ ఆనందంలో మునిగి తేలుతున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: