లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ తర్వాత ఆర్జివి మరో సంచలన సినిమా చేయదలచుకున్నాడు. అదే కమ్మరాజ్యంలో కడప రెడ్లు. టైటిల్ ఎనౌన్స్ చేసిన దగ్గర నుండి ఈ సినిమాపై క్యూరియాసిటీ పెరిగింది. అయితే తన సినిమా ఏదైనా వివాదం కాకుండా చేయడం వర్మ వల్ల కాదు. అనుకున్నట్టుగానే కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాపై గొడవ మొదలైంది. సినిమాపై కోర్ట్ కేసు నడుస్తుండగా టైటిల్ మార్చేశాడు ఆర్జివి.

 

అయితే సెన్సార్ వాళ్లు సినిమా చూసి చాలా కత్తెరలు వేశారు. ఇక చివరకు తన సినిమాను ఎలాంటి సెన్సార్ లేకుండా ఆన్ లైన్ లో అయినా వదలాలని ఫిక్స్ అయ్యాడు వర్మ. కాని ఎలాగోలా మళ్లీ సెన్సార్ వారు టైటిల్ మార్చడం సినిమాలో సీన్స్ కట్ చేయడం వల్ల రిలీజ్ కు ఓకే చెప్పారు. అయితే అసలు ఇంతకీ ఈ సినిమాతో ఆర్జివి ఏం చెప్పదలచుకున్నాడు. కులాల మధ్య కుమ్ములాటల గురించి వర్మ చెబుతాడా.. రాజకీయం పేరుతో వారు చేస్తున్న పనుల గురించి ప్రస్థావిస్తాడా అంటే.

 

అదేం లేదని తెలుస్తుంది. ఏపిలో ప్రస్తుతం అధికార పార్టీ.. ప్ర్తి పక్ష పార్టీల మధ్య ఉన్న గొడవలనే ప్రధాన కథాంశంగా ఎన్నుకుని ఈ సినిమా చేశాడు తప్ప ఏ రాజకీయ పార్టీని కించపరచలేదని టాక్. కేవలం ఆ పాత్రల రిఫరెన్స్ ను వాడారే తప్ప వారి గురించి మరి అంత చెడుగా ఏం చూపించలేదు అన్నది కొందరి మాట. అయితే అందరికి తెలిసిన వ్యక్తులు కాబట్టి సినిమా మీద అంచనాలు పెరిగాయి.. దానితోనే గొడవలు పెరిగాయి.

 

ఇక టీజర్, ట్రైలర్, సాంగ్స్ ఇలా అన్ని సినిమాపై ఎక్సైటింగ్ ఏర్పడేలా చేశాయి. కేవలం ఒక పార్టీకి సపోర్ట్ గా వర్మ ఈ సినిమాలు చేస్తున్నాడు అని కొందరు అంటుంటే ఆర్జివి ఏ పార్టీకి సపోర్ట్ చేయడు. అతనికి అనిపిచింది చేస్తాడు ఒకరు చెబితే వినడని కొందరు అంటున్నారు. ఏది ఏమైనా ఆర్జివి చేసిన అమ్మరాజ్యంలో కడప బిడ్డలు ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: