సంచలనాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ఆర్జివి ఎప్పుడు ప్రేక్షకాదరణ కోసం సినిమాలు చేయడు. ఆర్జివి దృష్టిలో సినిమాకు అర్ధమే వేరని చెప్పొచ్చు. టెక్నికల్ గా పాతికేళ్ల క్రితమే అడ్వాన్స్ గా ఆలోచించే వర్మ ప్రస్తుతం అతను చేస్తున్న సినిమాల పట్ల అతని ఫ్యాన్స్ కూడా నిరాశలో ఉన్నారు. తను చెప్పే ప్రతి విషయానికి లాజిక్ ఉంటుంది. తనతో మాట్లాడితే వర్మ చెప్పేది నిజమే కదా అనిపిస్తుంది.

 

అయితే శివతో సంచలన విజయం అందుకుని ఆ తర్వాత అదే తరహా సినిమాలు చేసిన వర్మ సడెన్ గా వంగవీటి, లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ సినిమాలతో షాక్ ఇచ్చాడు. ఇప్పుడు అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు అంటూ వస్తున్నాడు. ఆర్జివి ఎందుకు ఇలాంటి సినిమాలను చేస్తున్నాడు. కేవలం డబ్బు కోసమేనా.. అలా అయితే అతను ఇంకా మంచి కమర్షియల్ సినిమాలు చేసి కోట్లకు కోట్లు వెనుకేసుకోవచ్చు కదా.

 

ఓ పక్క ఆ తర్వాత ఎప్పుడో వచ్చిన రాజమౌళి తెలుగు సినిమా స్థాయిని పెంచుకుంటూ వెళ్తుంటే ఎప్పుడో తీసిన శివ పేరుని చెప్పుకుంటూ ఆర్జివి ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నాడు. నిజంగా ఆయన చేసిన ఈమధ్య సినిమాలు రాజకీయ నాయకుల్లో పొలిటికల్ హీట్ పెంచడానికి తప్ప ఇంకేదైనా జరిగే అవకాశం ఉందా. ఒకవేళ నింజంగానే ఆడియెన్స్ ఈ సినిమాలతో ఎంటర్టైన్ అవుతారన్న నమ్మకం కూడా లేదు. 

 

తను ఏం చేసినా అంతా తెలివితోనే తెలిసి చేసే ఆర్జివి తనకున్న టెక్నికల్ నాలెజ్డ్ తో ఓ అద్భుతమైన సినిమా చేసి చూపించొచ్చు కదా. ఎందుకు ఈ అనవసర ప్రయత్నాలు అని కొందరు అంటున్న మాట. ఏది ఏమైనా ఆర్జివి ఎప్పటికి ఆర్జివినే అనుకుంటూ ఆయన ఏం చేసినా ఆహా ఓహో అనే ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ కూడా ఉన్నారు. అందుకే ఆయన రిస్క్ తీసుకోకుండా సినిమాలు చేస్తున్నాడు. మరి అన్ని తెలిసిన మేధావి ఆర్జివి ఈ విషయంపై కాస్త దృష్టి పెడితే మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: