నిన్న విడుదలైన ‘అల వైకుంఠపురములో’ టీజర్ కు విపరీతమైన స్పందన రావడంతో బన్నీ అభిమానులు మాత్రమే కాకుండా ఈ టీజర్ ను అందరు చూస్తున్న నేపధ్యంలో ఈ టీజర్ హిట్స్ రికార్డ్స్ తో యూట్యూబ్ హోరెత్తిపోతోంది. దీనితో మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’ టీమ్ తమ సోమవారం సెంటిమెంట్ కు బ్రేక్ ఇచ్చి ఈరోజు మహేష్ రష్మికలకు సంబంధించిన రెండు పోస్టర్లు ఈరోజు ఉదయం విడుదల చేసారు. 

వాస్తవానికి రష్మిక ప్రస్తావన ‘సరిలేరు నీకెవ్వరు’ టీజర్ లో కూడ కనిపించలేదు. దీనితో ఆమె పై ఈ సినిమా టీమ్ రష్మిక పై ఒక ప్రత్యేకమైన టీజర్ ను విడుదల చేస్తారని వార్తలు వచ్చాయి. అయితే ఇంకా ఆ టీజర్ బయటకు రాకుండానే రష్మిక మహేష్ లు కలిసి ఉన్న ఒక రొమాంటిక్ లుక్ పోస్టర్ ను విడుదల చేసి సోషల్ మీడియాలో నటిజన్ల దృష్టిని ‘అల వైకుంఠపురములో’ నుండి ‘సరిలేరు నీకెవ్వరు’ కు దృష్టిని మళ్ళించాలని సరికొత్త ప్రయోగంలో రష్మిక మ్యానియాను వాడుకుంటున్నారు. 

దీనితో మహేష్ రష్మికల జంట ఎలా ఉంటుంది అన్న విషయమై ఒక క్లారిటీ వచ్చింది. ఇది ఇలా ఉంటే రష్మిక మహేష్ డాన్సింగ్ స్కిల్స్ గురించి మాట్లాడుతూ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ పై విపరీతంగా సెటైర్లు పడుతున్నాయి.

లేటెస్ట్ గా తాను మహేష్ తో ఒక పాట కోసం డాన్స్ చేస్తున్నప్పుడు మహేష్ డాన్సింగ్ స్కిల్స్ ముందు తాను సరితూగ లేకపోయాను అంటూ ఆమె చేసిన కామెంట్స్ చూసి చాల మంది ఆశ్చర్యపోతూ రష్మికను ట్రోల్ చేస్తున్నారు. అంతేకాదు మహేష్ డాన్స్ చేయడంలో తడబాటు పడ్డ గత సినిమాలోని కొన్ని దృశ్యాలకు సంబంధించిన వీడియోలను షేర్ చేస్తూ మహేష్ డాన్సింగ్ స్కిల్స్ ఇవేనా ? రష్మిక అంటూ ఆమెను ఆట పట్టిస్తున్నారు..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: