డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా ఎట్టకేలకు అనేక అవాంతరాలు మధ్య విడుదల అయ్యింది. సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది. ఈ సినిమాని ఆపాలని చాలా మంది రాజకీయ నాయకులు మరియు అదే విధంగా కొన్ని సామాజిక వర్గానికి చెందిన పెద్దలు ప్రయత్నించినా కానీ వారి ప్రయత్నాలు విఫలం కావడంతో ఎట్టకేలకు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన అమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా ఈరోజు తీవ్ర ఉత్కంఠ పరిస్థితుల మధ్య సిల్వర్ స్క్రీన్ పై విడుదలైంది. ఈ నేపథ్యంలో సినిమాని ఆపాలని చూసిన ప్రతి ఒక్కరిని భవిష్యత్తులో వదలను అంటూ వార్నింగ్ ఇస్తూ న్యాయపరంగా వారికి తగిన శిక్ష పడేలా రాబోయే రోజుల్లో చర్యలు తీసుకోబోతున్నట్లు రామ్ గోపాల్ వర్మ వీడియో లో వార్నింగ్ ఇస్తూ సోషల్ మీడియా లో పెట్టిన సంగతి మనకందరికీ తెలిసినదే.

 

అంతేకాకుండా సినిమా విడుదల కాకుండా గోతులు తీసి కొంతమందికి లేనిపోని విషయాలు చెప్పి క్రియేట్ చేసి అనేక కేసులు ఫైల్ చేయాలని ప్రయత్నాలు చేశారు కానీ వారి ప్రయత్నాలు మొత్తం విఫలమయ్యాయి ఎట్టకేలకు సినిమా రిలీజ్ అవుతుంది. అంటూ వీడియో లో వర్మ మాట్లాడుతూ..  ప్రజాస్వామ్యంలో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఎలా ఉంటుందో అన్నీ తెలిసే మేం ఈ సినిమా తీశాం. అన్నీ ఆలోచించే సినిమా తీశాను. అంత బుర్రలేకుండా వ్యవహరించలేదు. కానీ దీనిని ఆపడానికి చాలా మంది ట్రై చేశారు. ఎందుకు ట్రై చేశారు? ఎంత డబ్బు ఇచ్చారు? వీటన్నింటినీ చాలా తొందరలో బయటపెట్టబోతున్నాం అన్ని విషయాలు బయటకు లాగుతాం అంటూ వర్మ వార్నింగ్ ఈ వీడియోలో ఇవ్వటం జరిగింది.

 

అంతేకాక ఈ సినిమా ఒక కామెడీ సెటైర్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా అని సినిమాలో ఒక్కరిని తక్కువ చేయలేదు మరొకరు ఎక్కువ చేయలేదు సినిమా చూశాక అర్థమవుతుందని రాంగోపాల్ వర్మ తెలిపారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈ సినిమా విడుదలై సినిమా హాల్లో రన్ అవుతున్న క్రమంలో ఎక్కడైనా ఏదైనా సినిమాకి అవాంతరాలను కలిగించాలని చూస్తే సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇచ్చిన ఉద్దేశించి సినిమా ను ఆపేయాలని చూస్తే పోలీసులతో థియేటర్ కి రావటానికి రామ్ గోపాల్ వర్మ అన్ని జాగ్రత్తలు ముందే తీసుకున్నట్లు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: